అసలోడు వచ్చే వరకూ కొసరోడికి పండగే..? ఒంగోలులో లోకేష్ కు జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్.. !
ఏపీలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు ఓవైపు నారా లోకేష్ పాదయాత్ర చేస్తుండగా.. ఇప్పుడు ఆయనకు పార్టీలో కనిపించని ప్రత్యర్ధిగా మారిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చికాకు పెడుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు టూర్లలో జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు చేస్తూ ఆయన్ను చికాకు పెడుతున్న జూనియర్ అభిమానులు ఇప్పుడు నారా లోకేష్ ను సైతం టార్గెట్ చేసుకుంటున్నారు. ఒంగోలులో తాజాగా ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది.
Recommended Video

ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అనుకోని షాకిచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ను తదుపరి సీఎంగా పేర్కొంటూ ఓ ఫ్లెక్సీ పెట్టారు. అంతటితో ఆగకుండా ఓ కోట్ కూడా పెట్టారు. దీంతో ఇప్పుడు ఆ కొటేషన్ లో వాడిన పదాలు కచ్చితంగా లోకేష్ తో పాటు చంద్రబాబును కూడా మంటపుట్టించేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో లోకేష్ కానీ, టీడీపీ నేతలు కానీ ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది.

ఇంతకీ ఆ ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏం పెట్టారో తెలుసా. అసలోడు వచ్చే వరకూ కొసరోడికి పండగే అనే కామెంట్ ను ఫ్యాన్స్ పెట్టారు. దీనర్ధం అసలోడైన జూనియర్ ఎన్టీఆర్ వచ్చే వరకూ కొసరోడు అయిన నారా లోకేష్ కు పండగే అన్న మాట. ఇప్పుడు పాదయాత్రగా వస్తున్న నారా లోకేష్ కు భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో క్రియాశీలకం అయి బాధ్యతలు చేపట్టే వరకూ పండగే అనే అర్దం వచ్చేలా ఫ్యాన్స్ పెట్టిన ఈ ఫ్లెక్సీ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అవుతోంది.
గతంలో 2009 ఎన్నికల సమయంలో ఓసారి టీడీపీ కోసం తిరిగి విస్తృతంగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక మళ్లీ కనిపించలేదు. అయితే చంద్రబాబు తన కుమారుడు లోకేష్ కోసమే జూనియర్ ను పక్కనబెట్టేశారన్న ప్రచారం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా సాగుతోంది. కానీ చంద్రబాబు కుటుంబంతో ఇప్పటికీ సన్నిహితంగా ఉంటున్న జూనియర్ ప్రస్తుతం సినిమాలపైనా తన దృష్టిపెట్టారు. భవిష్యత్తులో టీడీపీ పరిస్ధితి మరీ దారుణంగా మారితే అప్పుడు ఆయన ఎంట్రీ ఇవ్వొచ్చన్న ప్రచారం మాత్రం సాగుతోంది. ఈ లోపు ఆయన అభిమానులు చంద్రబాబు, లోకేష్ ను చికాకుపెడుతున్నారు.












Click it and Unblock the Notifications