Personal Loans: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..!

చాలా మందికి ఆర్థిక పరమైన అవసరాలు ఉంటాయి. అందుకు కోసం వారు అప్పు చేస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తుండడంతో.. ఎక్కువ మంది పర్సనల్ రుణాలు తీసుకుంటారు. అయితే వ్యక్తిగత రుణం తీసుకునే ముందు కొన్ని తెలుసుకోవాలి. అవి ఏమిటంటే..

లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే..?

లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ద్వారా మీకు ఈఎంఐ ఎంత పే చేయాలో సింపుల్ గా అర్థం అవుతుంది. అలాగే ఎన్ని రోజులు చెల్లించాలో కూడా తెలిసిపోతుంది. ఈఎంఐ కాలిక్యులేటర్ ఫైనాన్షియల్ ప్రణాళికలో సహాయపడే ఖచ్ఛితమైన లెక్కలను అందిస్తుంది. మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలని భావించినప్పుడు తక్కువ వడ్డీతో ఎక్కడ రుణాలు ఇస్తున్నారో తెలుసుకోవాలి. ఆ తర్వాత తీసుకున్న లోన్ కు వడ్డీ ఎంత పడుతుంది. నెలనెల ఎంత చెల్లిస్తున్నాం. ఎన్ని రోజులు ఈఎంఐ చెల్లించాలనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Personal loan borrowers can calculate using EMI calculator

దీన్ని సులభతరం చేసేందుకు పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగపడుతుంది. ఇది ఈ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. లెక్కలను సులభతరం చేస్తుంది. మీరు నెలనెల ఎంత చెల్లించాలో తెలుసుకోవడంలో పనికొస్తోంది. ఈ లెక్కలతో మీరు మీ బడ్జెట్ ను మరింత సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు. కచ్చితమైన ఆర్ధిక నిర్ణయాలను తీసుకోవచ్చు.

ఒక రుణము కొరకు దరఖాస్తు చేసే ముందు ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ను ఉపయోగించడం ఎందుకు ముఖ్యమైందో తెలుసుకుందాం.

1. ఎక్కడ రుణం తక్కువ వడ్డీకి ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవచ్చు
రుణాలు ఇచ్చే బ్యాంకులు, ఎన్భీఎఫ్సీల్లో విభిన్న నియమాలు, వడ్డీ రేట్లు, ఈఎంఐ విధానాలు ఉంటాయి. ఎందులో తక్కువ వడ్డీకి లోన్ లభిస్తుందో తెలుసుకోవడానికి ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగపడుతుంది. వివిధ వడ్డీ రేట్లు లేదా రుణ మొత్తాలను కాలిక్యులేటర్ లో ఎంటర్ చేయడం ద్వారా, మీరు మీ ఈఎంఐ తెలుసుకోవచ్చు. వేరువేరు రుణదాతల నుంచి రుణాలను తీసుకోవడము, దీర్ఘ-కాలిక ప్రభావాల గురించి వివరాలను అందించడముతోపాటు మీరు అత్యంత కాస్ట్-ఎఫెక్టివ్ రుణాన్ని ఎంచుకోవడానికి ఈఎంఐ కాలిక్యులేటర్ సహాయపడుతుంది.

2. ఆర్ధిక ప్రణాళిక
మీ నెలవారి ఆర్ధిక అవసరాల గురించి స్పష్టమైన అవగాహనను అందించడం పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగపడుతుంది. మీరు రుణం ఎంత తీసుకున్నారు. నెలనెల ఎంత ఈఎంఐ కట్టాలి. ఎన్ని రోజులు చెల్లించాలో తెలుసుకోవడానికి కాలిక్యులేటర్ సహాయపడుతుంది. ఈఎంఐ కాలిక్యులేటర్ లో మీ రుణం మొత్తము, కాలపరిమితి, వడ్డీ రేటును ఎంటర్ చేస్తే మీరు నెలనెల ఎంత చెల్లించాలో తెలుసుకోవచ్చు. దాని ప్రకారం మీరు ఖర్చులను ప్లాను చేసుకోవచ్చు.
ఖచ్ఛితమైన ఆర్ధిక ప్రణాళికతో మీరు మీ పరిధిని మించి వెళ్ల కుండా చూసుకోవచ్చు. సరిగా బడ్జెట్ ప్లాన్ చేసుకోవచ్చు.

3. ఋణ సర్దుబాట్లు
ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ద్వారా మీరు వివిధ ఋణ కాలపరిమితులను తెలుసుకోవచ్చు. మీరు నెలవారి చెల్లింపులను, చెల్లించిన మొత్తం వడ్డీని ఎలా ప్రభావితం చేస్తాయో కాలిక్యులేటర్ ద్వారా తెలుస్తుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితి అనుగుణంగా రుణ చెల్లింపు కాలపరిమితిని ఎంచుకోవచ్చు. మీరు చెల్లింపు కాల పరిమితి తగ్గిస్తే ఈఎంఐ పెరుగుతోందని.. చెల్లింపు కాలపరిమితి పెంచితే ఈఎంఐ తగ్గుతుందని ఈఎంఐ కాలిక్యులేటర్ ద్వారా తెలుసుకోవచ్చు.

4. బడ్జెటింగ్
ప్రభావవంతమైన బడ్జెటింగ్ కోసం మీ నెలవారి చెల్లింపు మొత్తం ఎంతో తెలుసుకోవడం చాలా కీలకం. మీ నెలవారి ఖర్చులను ఖచ్ఛితంగా చూసుకునేందుకు, రుణ చెల్లింపులను సౌకర్యవంతంగా చెల్లించేందుకు పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ సహాయపడుతుంది.

5. ఆర్థిక ఒత్తిడి తగ్గించడం
మీ నెలవారి పర్సనల్ లోన్ ఈఎంఐల గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం వల్ల ఆర్ధిక ఒత్తిడి తగ్గుతుంది. ముందుగానే మీ ఖర్చుల గురించి తెలుసుకోవడం ద్వారా, మీరు మీ ఆర్ధిక పరిస్థితిని మరింత సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు. ఇందుకోసం ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగపడుతుంది.

6. సమయం-ఆదా
మీరు పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు పెన్ను, పేపర్ తో లెక్కలు చేస్తే చాలా సమయం వృథా అవుతుంది. అదే ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ అతి తక్కువ సమయంలో కచ్ఛితమైన ఫలితాలను ఇస్తుంది. ఈఎంఐ కాలిక్యులేటర్ యూజర్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది.

పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ కేవలం సౌకర్యవంతమైన సాధనం మాత్రమే కాదు.. రుణం తీసుకునే క్రమంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. ఇది ఋణ సంబంధిత ఖర్చుల వివరణాత్మక విభజనను అందిస్తుంది. బడ్జెటింగ్ లో సహాయం చేస్తుంది, రుణ కాలపరిమితులలో సర్దుబాట్లు చేసుకునే అవకాశం కల్పిస్తుంది.
వడ్డీ రేట్లు ఎలా చెల్లింపులను ప్రభావితం చేస్తాయో వివరిస్తుంది. ఈఎంఐ కాలిక్యులేటర్ పర్సనల్ లోన్స్ సంక్లిష్టతను తగ్గిస్తుంది. పర్సనల్ లోన్లు అనేక ఎన్బీఎఫ్సీ అందుస్తున్నాయి. ఇందులో బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీలు ఉన్నాయి.

బజాజ్ ఫిన్సర్వ్ వంటి పర్సనల్ లోన్ 24 గంటల్లో ఇస్తుంది. ఇది రూ. 40 లక్షల వరకు పర్సనల్ లోన్ల ఇస్తోంది. తక్షణ, ఖచ్ఛితమైన ఫలితాల కోసం బజాజ్ ఫిన్సర్వ్ వెబ్ సైట్ పై ఉన్న పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించి మీరు సులభంగా మీకు కావలసిన రుణ మొత్తం, వడ్డీ రేటు, కాలపరిమితిని ఎంటర్ చేసి.. వివిధ ఎంపికలను పోల్చి చూడవచ్చు. అకర్షణీయమైన ప్లాన్ ను ఎంచుకోవచ్చు.

పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ను ఉపయోగించుటకు ఈరోజే బజాజ్ ఫిన్సర్వ్ వెబ్ సైట్ ను సందర్శించండి. మీ అవసరాలకు అనుగుణంగా పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేయండి!

*షరతులు వర్తిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+