గుడివాడలో కొడాలి నాని ఓడిపోతున్నారా..? మారిన గెలుపు లెక్కలు
గుడివాడ అంటే అందరికి ఠక్కున గుర్తుకు వచ్చేది అక్కడి ఎమ్మెల్యే కొడాలి నానినే. గత నాలుగు పర్యాయాలుగా గుడివాడ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వస్తున్నారాయన. 2004,2009 ఎన్నికల్లో టీడీపీ తరుఫున ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొడాలి నాని..ఆ తర్వాత వైసీపీలో చేరి 2014,2019 ఎన్నికల్లో విజయం సాధించారు. జగన్ మంత్రివర్గంలో మంత్రిగా కూడా రెండున్నర సంవత్సరాలు పని చేశారు. అయితే కొడాలి నాని గెలిచిన నాలుగు పర్యాయాల్లో ఒక్కసారి మాత్రమే పార్టీ అధికారంలోకి రావడం జరిగింది.
మిగిలిన మూడుసార్లు కూడా ప్రతిపక్షంలోనే ఉండటంతో గుడివాడ నియోజకవర్గ అభివృద్ది అనుకున్నంత స్థాయిలో జరగలేదనే విమర్శ ఆయనపై ఉంది. మరోవైపు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కొడాలి నాని..ఆ పార్టీకి కొరకరాని కొయ్యి మాదిరిగా తయ్యారయ్యారు.ఈసారి కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలని కసితో టీడీపీ ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌లపై కొడాలి నాని ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుంటారు. దీంతో ఎలాగైనా ఆయన్ను ఓడించాలనే పట్టుదలతో టీడీపీ నేతలు పని చేశారు. దీనిలో భాగంగానే ఎన్నారై అయిన వెన్నిగండ్ల రామును రంగంలోకి దించడం జరిగింది.

వెన్నిగండ్ల రాము గెలుపు కోసం టీడీపీ, జనసేన నేతలు గట్టిగానే కృషి చేశారు. 2019 ఎన్నికలకు వరకు కొడాలి నానికి సపోర్టుగా నిలిచిన కమ్మ , కాపు వర్గాలు ఈసారి ఆయనకు దూరం అయినట్టు తెలుస్తోంది. బీసీలు కూడా పెద్ద ఎత్తున కూటమికి మద్దతుగా నిలిచినట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో గుడివాడలో కొడాలి గెలుపు అంత ఈజీ కాదనే మాటలు వినిపిస్తున్నాయి. మరోవైపు కొడాలి నాని ఓడిపోతారంటూ పెద్ద ఎత్తున బెట్టింగులు కూడా సాగుతున్నాయి.దీంతో కొడాలి నాని ఓడిపోతున్నారంటూ రాష్ట్రం అంతట ప్రచారం జరుగుతోంది
అయితే గెలుపు కొడాలి నాని మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన గుడివాడలో తనని ఓడించలేరని ధీమాతో ఉన్నారాయన. ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలు వైసీపీకి మద్దతుగా నిలిచినట్టు తెలుస్తోంది. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే తిరిగి కొడాలి నానిని గెలిపిస్తాయని ఆయన అనుచరులు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో 19,479 మెజారిటీతో విజయం సాధించిన కొడాలి నాని..ఈసారి ఎంత తీసేసిన 5000 ఓట్లతో అయిన బయటపడతారని వైసీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మరి గుడివాడ విజేత ఎవరో తెలియాలంటే జూన్ 4న వెలువడే ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలి.
-
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications