వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖతార్ ఓపెన్ క్వార్టర్స్ లో ఖంగు తిన్న ఫెదెరర్..జార్జియా ఆటగాడు నికోల్స్ చేతిలో ఓటమి

|
Google Oneindia TeluguNews

13 నెలల సుదీర్ఘ విరామం తర్వాత టెన్నిస్ మైదానంలో అడుగు పెట్టిన స్విస్ స్టార్ రోజర్ ఫెదెరర్ ఖతార్ ఓపెన్ తొలి మ్యాచ్ లో నెగ్గి సత్తా తగ్గలేదని నిరూపించుకున్నాడు. అయితే ఆ జోరును క్వార్టర్స్ లో కొనసాగించలేకపోయాడు. జార్జియా ఆటగాడు నికోల్స్ చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. క్వార్టర్ ఫైనల్‌లో అనూహ్యంగా ఫెదెరర్ ఓటమిని చవిచూశాడు. ఖతార్ ఓపెన్‌లో 6-3, 1-6, 5-7 తేడాతో ఓడిపోయాడు. ఇదివరకు జరిగిన మ్యాచ్‌లో నికొలాస్‌పై ఫెదెరర్ ఈజీగా విజయం సాధించాడు. 2016లో ఆస్ట్రేలియా ఓపెన్‌లో 6-2, 6-1, 6-2 తేడాతో విక్టరీ కొట్టాడు.

 Qatar Open: Basilashvili sends Federer packing in the quarterfinal

ఇప్పటికే మేజర్ టోర్నీల నుంచి రోజర్‌ ఫెడరర్‌ తప్పుకోవడంతో రిటైర్మెంట్ ఇస్తాడని ఊహాగానాలు వచ్చాయి. అయితే అవన్నీ గాలి వార్తలే అని ఖతార్‌ ఓపెన్‌ 2021లో బరిలోకి దిగి నిరూపించాడు. కానీ ఖతార్ క్వార్టర్ ఫైనల్లోనే చతికిలబడ్డాడు. దీంతో ఈ ఏడాది జరిగే వింబుల్డన్ ఓపెన్, టోక్యో ఒలింపిక్స్‌‌లో ఎలా ఆడతారనే ప్రశ్న వస్తోంది. టైటిల్ గెలుస్తాడా.. లేదంటే చతికిలబడతాడనే కొశ్చన్ వస్తోంది.

తాను తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని ఫెదెరర్ అన్నారు. గత మ్యాచ్‌లో గెలిచిన సంగతి తెలిసిందే. అయితే 13 నెలల్లో ఇదే తొలి మ్యాచ్‌. గెలుపు రుచి ఎప్పటికీ బాగుంటుంది. ఇది మంచి మ్యాచ్ అని ఫెదెరర్ అన్నాడు. తన ప్రదర్శన సంతోషంగా ఉంది. ముగింపు బాగుంది' అని ఆన్-కోర్ట్ ఇంటర్వ్యూలో ఫెదెరర్‌ చెప్పాడు. కానీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయి ఇంటి ముఖం పట్టాడు.

English summary
Roger Federer's return to competitive action ended early as the Swiss great lost to Georgia's Nikoloz Basilashvili quarterfinals of the Qatar ExxonMobil Open.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X