మరోసారి హైకోర్టుకు అనంతబాబు, బెయిల్ పిటిషన్ విచారణ బుధవారానికి వాయిదా
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హత్య కేసులో ఆయన నేరం ఒప్పుకున్న సంగతి తెలిసిందే. బెయిల్ కోసం అనంతబాబు ఫైల్ చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టి.. బుధవారానికి వాయిదా వేసింది. బెయిల్‌పై హైకోర్టు విచారణ వాయిదా వేయడంతో అనంతబాబు శుక్రవారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో లొంగిపోయిన సంగతి తెలిసిందే.
తల్లి మరణించడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అనంతబాబుకు రాజమహేంద్ర వరం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 3 రోజులు మాత్రమే బెయిల్ మంజూరు చేసింది. దానిని సవాల్ చేస్తే అనంతబాబు హైకోర్టును ఆశ్రయించారు. అనంతబాబు బెయిల్‌ను మరో 11 రోజుల పాటు పొడిగిస్తూ హైకోర్టు గత నెలలో ఆదేశాలు జారీ చేసింది. ఈ బెయిల్ గడువు ముగియడం, రెగ్యులర్ బెయిల్‌పై హైకోర్టు విచారణను వాయిదా వేయడంతో శుక్రవారం అనంతబాబు జైలుకు వచ్చారు.

అంతకుముందు రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టులో బెయిల్ కోసం అనంతబాబు ఆశ్రయించారు. వరసగా మూడుసార్లు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. నిర్దేశిత సమయంలో చార్జీషీట్ వేయలేదని.. అందుకోసమే బెయిల్ కావాలని ఆయన అడిగారు. ఆ కారణం చూపడంతో.. కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అయితే తల్లి చనిపోతే.. 3 రోజులు మాత్రం బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
సాంప్రదాయంగా చేయాల్సిన పనులు ఉండటంతో బెయిల్ కోసం అప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. అప్పుడు హైకోర్టు 11 రోజులకు బెయిల్ ఇచ్చింది. బెయిల్ గడువు 5వ తేదీ నాటికి ముగిసింది. దీంతో తనకు బెయిల్ కావాలని ఆయన మరోసారి హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ వాయిదా పడింది. దీంతో ఆయన సెంట్రల్ జైలుకు వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications