RCB vs RR: ఆర్ఆర్‌కి చావో రేవో.. మరో విజయంపై ఆర్సీబీ కన్ను..
ఐపీఎల్‌లో నేడు (శనివారం) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. రెండు జట్లలో ఆర్సీబీ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. ఇవాళ శనివారం కావడంతో రెండు మ్యాచులు ఉంటాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ జరగబోతోంది. రెండు జట్లలో బెంగళూరు 55 శాతం విజయం సాధిస్తోందని అంచనా వేయగా, రాయల్స్ 45 శాతం గెలుస్తోందని ప్రిడిక్ట్ చేశారు. రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడబోతున్నాయి.
Recommended Video
ఆర్సీబీ కూడా ఫామ్ లో ఉంది. కానీ ఆలస్యంగా పుంజుకుంది. ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడగా కేవలం మూడింటిీలో మాత్రమే ఓడిపోయి.. మూడోస్థానంలో నిలిచింది. రాజస్తాన్ అయితే చివరి నుంచి రెండో వసరలో ఉంది. 8 మ్యాచులు ఆడగా.. 5 ఓడిపోయింది. 3 మ్యాచులు మాత్రమే విజయం సాధించింది.

ఆర్సీబీ జట్టు అన్నీ విభాగాల్లో సత్తా చాటుతోంది. అందరూ టీమ్‌గా ఆడటంతో విజయాలు సాధిస్తోంది. బ్యాట్స్ మెన్, బౌలర్లు కూడా సత్తా చాటుతున్నారు. ఇటు రాజస్తాన్ రాయల్స్ విషయంలో కూడా అందరూ కలిసి ఆడుతున్నారు. కానీ ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఇవాల్టి మ్యాచ్ రెండు జట్లకు కీలకం కానున్నది. మ్యాచ‌్ గెలవాలని ఇరు జట్లు కోరుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications