జియోలో కొత్తగా 5 ప్రీ పెయిడ్ ప్లాన్స్

తన వినియోగదారులకు మెరుగైన సేవలందించడంతోపాటు కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు రిలయన్స్ జియో కొత్త గా ప్రీ పెయిడ్ ప్లాన్స్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్స్ వల్ల కొత్తగా యూజర్లు వస్తారని కంపెనీ ఆశిస్తోంది. JioSave Pro subscriptionతో జియో ఉచిత ప్లాన్లను ప్రారంభించింది. కాలింగ్, డేటా, మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ JioSaveకి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. దీనివల్ల ఎటువంటి వాణిజ్య ప్రకటనలు లేకుండా మ్యూజిక్ స్ట్రీమింగ్ పొందొచ్చు.

చౌకైన ప్లాన్ రూ.269
5 కొత్త ప్లాన్లలో అత్యంత చవకైనది రూ.269 నుంచి ప్రారంభమవుతోంది. వ్యాలిడిటీ 28 రోజులు. ప్రతి రోజు 1.5GB డేటా ఉంటుంది. దేశంలోని అన్ని నెట్ వర్క్ లకు అన్ లిమిటెడ్ కాలింగ్ చేయవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా పొందొచ్చు. ఈ ప్లాన్ JioSave Pro సబ్‌స్క్రిప్షన్, అన్‌లిమిటెడ్ 5జి డేటా, Jio Suite యాప్ యూజర్లకు యాక్సెస్ ఉంటుంది.

Reliance Jio

రూ.529 ప్లాన్
రూ.529 ప్లాన్ తీసుకున్న వారికి 56 రోజుల వాలిడిటీ ఉంటుంది. రోజుకు 1.5జిబి డేటా లభిస్తుంది. యాడ్ ఫ్రీ మ్యూజిక్, అన్ లిమిటెడ్ జియో ట్యూన్ తో కలిపి అదనపు ప్రయోజనాలుంటాయి. కాల్స్, మెసేజ్ లు అన్ లిమిటెడ్.

రూ.589 ప్లాన్
jio malరూ.589 ప్లాన్ తీసుకున్న వారికి ప్రతిరోజు 2జిబి డేటా, 100 మెసెజెస్, అన్ని నెట్ వర్క్ లకు అన్ లిమిటెడ్ కాలింగ్, జియో శావన్ ఉచిత సబ్ స్క్రిప్షన్, అన్ లిమిటెడ్ 5జీ డేటాతోపాటు JioSuite యాప్ కు యాక్సెస్ ఇస్తారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు.

రూ.739 ప్లాన్
రూ.739 ప్లాన్ తీసుకున్న వారికి 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. పై ప్లాన్లలో ఏవైతే చెప్పారో దీనికి కూడా అవే వర్తిస్తాయి. ప్రతిరోజు 2జిబి డేటా, 100 మెసెజెస్, అన్ని నెట్ వర్క్ లకు అన్ లిమిటెడ్ కాలింగ్, జియో శావన్ ఉచిత సబ్ స్క్రిప్షన్, జియో ట్యూన్, అన్ లిమిటెడ్ 5జీ డేటాతోపాటు JioSuite యాప్ కు యాక్సెస్ ఇస్తారు.

Reliance Jio

రూ.789 ప్లాన్
రూ.789 ప్లాన్ తీసుకుంటే 84 రోజుల వాలిడిటీ ఉంటుంది. ప్రతిరోజు 2జిబి డేటా లభిస్తుంది. యాడ్ ఫ్రీ మ్యూజిక్, జియో ట్యూన్ బెనిఫిట్స్ ఉంటాయి. అన్ లిమిటెడ్ కాల్స్, మెసేజ్ లు చేసుకోవచ్చు. Jio Saavn Pro 15 భాషల్లో లభ్యమవుతోంది. వినియోగదారులు తమ భాష కోసం సెట్టింగులోకి వెళ్లి కావాల్సిన లాంగ్వేజ్ ను ఎంపిక చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+