Teachers Day 2023: ఈ టీచర్స్ డే రోజున.. ఈ గిఫ్ట్స్‌తో టీచర్‌ను సర్ప్రైజ్ చేయండి..!
గాడి తప్పుతున్న జీవితాన్ని సరైన మార్గంలో నడిపించే వారు ఉపాధ్యాయులు. మన జీవితాల్లో ఉపాధ్యాయులది కీలక పాత్ర. బడి, బాధ్యత, భవిష్యత్తును పరిచయం చేసేవాడు గురువు. సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయుల దినోత్సవం.ఈ సందర్భంగా మీరు ఎక్కువగా అభిమానించే గురువులకు ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏమైనా బహుమతులు ఇవ్వాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే.
పర్సనలైజ్డ్ గిఫ్ట్స్: మీకు నచ్చిన గురువుకు ఒక మంచి బహుమతితో సర్ప్రైజ్ చేయండి. ఇందుకోసం పర్సనలైజ్డ్ గిఫ్ట్స్ ఇస్తే బాగుంటుంది.ఇందులో భాగంగా మగ్స్, కీ చైన్స్, లేదా ఫోటో ఫ్రేమ్‌లలో ఆకట్టుకునే ఒక మెసేజ్ రాసి బహుమతిగా ఇస్తే కచ్చితంగా మీ టీచర్ ప్రత్యేకంగా ఫీల్ అవుతారు.

పుస్తకాలు: మీ టీచర్ ఆసక్తి ఏంటో కనుక్కుని ఒక మంచి పుస్తకం బహుమతిగా ఇవ్వొచ్చు.పుస్తకానికి మించిన మరొక బహుమతి ఇంకేదైనా ఉంటుందా చెప్పండి. అందుకే ఇంగ్లీషులో "A good book is like a good friend" అని అన్నారు.
గిఫ్ట్ కార్డులు: ఒక వేళ మీ టీచర్లు ఎలాంటివి ఇష్టపడుతారో మీకు తెలియకుంటే వారికి గిఫ్ట్‌కార్డులు ఇవ్వొచ్చు. అంటే బుక్‌స్టోర్, రెస్టారెంట్,ఆన్‌లైన్ రీటైలర్‌కు సంబంధించిన గిఫ్ట్ కార్డ్ ఇస్తే వారికి నచ్చినట్లుగా దాన్ని వినియోగించుకుంటారు.
స్టేషనరీ: స్టేషనరీ ఐటెమ్స్ కూడా మీ టీచర్లకు గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. పెన్స్, నోట్‌బుక్స్,స్టయిలిష్ ప్లానర్‌లాంటివి బహుమతిగా ఇస్తే బాగుంటుంది
మొక్కలు/పూలు కుండీ: ఒక చక్కటి పూల కుండీ లేదా మొక్కలున్న కుండీ ఇస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక విద్యార్థి జీవితం పువ్వులా వికసించడం వెనక ఒక టీచర్ కృషి ఉందని సింబాలిక్‌గా చెబుతుంది.

లేఖలు: కొన్ని సందర్భాల్లో మీ గురువుతో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకుంటూ ఆ తీపి గుర్తులను ఒక అద్భుతమైన సందేశంగా మలిచి ఓ లేఖపై రాసి ఇస్తే ఇంతకంటే ఆ గురువుకు ఎక్కువగా కలిగే ఆనందం ఏముంటుంది చెప్పండి.
ఎడ్యుకేషనల్ వర్క్‌షాప్: మీ టీచర్‌కు ఏ రంగంలో అయితే ఆసక్తి ఉందో ఆ రంగంలో జరిగే వర్క్‌షాప్‌లకు, సెమినార్లకు తీసుకెళ్లేలా ప్లాన్ చేయండి. కచ్చితంగా ఆ టీచర్ ఇంప్రెస్ అవుతుంది. సంతోషపడుతుంది.

ఇదంతా ఒకటైతే... మీ హృదయాంతరాల నుంచి వచ్చే ఆలోచనలు, మీరు సాధించిన విజయాలే ఉపాధ్యాయులకు నిజమైన సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తాయి. మీరు తన స్టూడెంట్ అని గర్వంగా చెప్పుకుంటారు. అదే వారికిచ్చే అసలైన గిఫ్ట్. ఇదే వారికి స్పెషల్ టీచర్స్ డేగా గుర్తుండిపోతుంది.












Click it and Unblock the Notifications