Sebi: ఇన్వెస్టర్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన సెబీ.. T+1 సెటిల్మెంట్‌పై కీలక ప్రకటన
Sebi: ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ కు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు సెబీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. గతంలో T+2 గా ఉండే సెటిల్మెంట్ సమయాన్ని T+1కు తగ్గించి చరిత్ర సృష్టించింది. ఇంకాస్త వేగవంతంగా సెటిల్మెంట్ పూర్తి చేసే విధంగా ముందుకు సాగుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ మధబి పూరీ బుచ్ గుడ్ న్యూస్ చెప్పారు.
స్టాక్ మార్కెట్లో ఇనిస్టెంట్ సెటిల్మెంట్ కోసం పెట్టుబడిదారులను అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సెబీ ఛైర్ పర్సన్ స్పష్టం చేశారు. ఈ ఫ్రేమ్ వర్క్ మీద ఇప్పటికే పని చేస్తున్నట్లు చెప్పారు. ఇది అమల్లోకి వస్తే స్టాక్స్ కొన్న వ్యక్తికి షేర్లు, అమ్మిన వారికి నగదు తక్షణమే వారి ఖాతాలకు జమవుతాయి అని వెల్లడించారు.

క్యాష్ ఈక్విటీ సెగ్మెంట్లో ప్రస్తుతం T+1గా ఉన్న సెటిల్మెంట్ పీరియడ్.. అత్యంత త్వరలోనే తక్షణ సెటిల్మెంట్ గా మారనుందని మధబి పూరీ బుచ్ ప్రకటించారు. T+6గా ఉన్న IPO టైమ్ లైన్ ని ASBA మెకానిజమ్ ద్వారా T+3కి మార్చే సమయంలో ఈక్విటీ సెటిల్మెంట్ గురించి ఆలోచించినట్లు చెప్పారు. ఇదే విధనాన్ని క్యాష్ సెగ్మెంట్ లో ప్రవేశపెట్టడంలో ఇబ్బంది లేదని భావించామన్నారు.
ఇప్పటికే సెటిల్మెంట్ పరంగా భారతీయ స్టాక్ మార్కెట్స్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనవిగా పేరుగాంచాయి. ఈ విషయంలో ఇంకాస్త ముందడుగు వేయడానికి ప్రస్తుతం సెబీ సిద్ధమవుతోంది. తద్వారా కొన్ని రకాల మోసాలకు సైతం చెక్ పెట్టవచ్చని మార్కెట్ నియంత్రణ సంస్థ భావిస్తోంది.












Click it and Unblock the Notifications