టిక్‌టాక్ సింగర్ రాజు ఆత్మహత్య: ‘రాఖీ’పై పాటపాడి, ముందు రోజే బలవన్మరణం
సిద్దిపేట: భారత్‌లో ఇటీవల నిషేధానికి గురైన టిక్‌టాక్‌తో పాటలు పాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్దిపేటకు చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలోని కోడూరు మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన గడ్డం రాజు పంట పొలం వద్ద ఆదివారం ఉదయం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
'అక్క రాఖీతో ఇంటికి వస్తే ఇక లేడని.. ఇక రాడని చెప్పమ్మా..' అనే పాటతో సోషల్ మీడియాలో రాజు మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే, రాఖీ పండగకు ముందు రోజే ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఆగస్టు 3న రాఖీ పండగ ఉండగా ముందు రోజే రాజు మరణించడంతో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రాజు ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. టిక్‌టాక్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజు ఆత్మహత్య చేసుకోవడం పట్ల అతని ఫాలోవర్లు విచారం వ్యక్తం చేశారు.
ఇది ఇలావుండగా, కరోనా భయంతో వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ రాజీనగర్‌లో ఎడమ వెంకటేశ్వరరావు(63), వెంకటలక్ష్మి(60) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు గత పది రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు.
Recommended Video
ఈ క్రమంలో తమకు కరోనా వచ్చిందేమో అనే అనుమానంతో కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి ఆత్మహత్యకు సంబంధించిన సూసైడ్ నోట్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications