#LightALamp Campaign: సామాజిక దురాచారాలపై "జోష్" పోరాటం..మీరు భాగమవ్వండి..!
ఈ పండగ వేళ ప్రముఖ షార్ట్ వీడియో యాప్ జోష్ #LightALamp క్యాంపెయిన్‌తో ముందుకొస్తోంది. ఈ క్యాంపెయిన్ ద్వారా సమాజంలో పాజిటివిటీని నింపే ప్రయత్నం చేస్తోంది.పలు సామాజిక అంశాలపై సమాజంలో అవగాహన తీసుకొచ్చే ప్రధాన లక్ష్యంగా ఈ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తోంది.ఇందులో భాగంగా ఎవరైనా సరే పాల్గొని తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిస్తోంది. కేవలం ప్రొఫెషనల్ క్రియేటర్స్ మాత్రమే కాకుండా ఎవరైతే సమాజంలో తమ వంతు పాత్ర పోషించాలని భావిస్తున్నారో వారు కూడా ఇందులో పాల్గొనే అవకాశం జోష్ కల్పిస్తోంది.
ఈ క్యాంపెయిన్‌లో మీరూ భాగం అవ్వాలంటే ముందుగా జోష్ యాప్‌ను ఓపెన్ చేయడం లేదా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.అందులో కనిపించే #LightALamp ఆప్షన్ పై క్లిక్ చేయండి. దీంతో మీకు చాలా ఫిల్టర్స్ కనిపిస్తాయి.ప్రతి ఒక్క ఫిల్టర్ ఒక సామాజిక అంశాన్ని ప్రస్తావిస్తుంది. ఇక యూజర్లు అక్కడ కనిపించే రావణాసురుడి తలను తెగనరకడం ద్వారా ఒక్కో సామాజిక రుగ్మతను తొలగిస్తున్నట్లుగా భావించాల్సి ఉంటుంది.

అంతేకాదు యూజర్లు తాము ఏ సామాజిక రుగ్మతపై మాట్లాడాలని భావిస్తున్నారో ఆ టాపిక్ పై మాట్లాడి ఆ వీడియోను రికార్డు చేసే ఆప్షన్ కూడా ఉంది.అంతేకాదు మీరు ఏదైనా సామాజిక సేవలో భాగమై ఉంటే.. అంటే ఆహారం పంపిణీ, వస్త్రాల పంపిణీ, బడుగు బలహీనవర్గాలకు చెందిన పిల్లలకు చదువు చెప్పడం,అవసరంలో ఉన్న వారిని సహాయం చేసి ఆదుకోవడంలాంటివి చేసి ఉంటే దానికి సంబంధించిన ఒక వీడియోను క్రియేట్ చేసి ఆ వీడియోను అప్‌లోడ్ చేయండి. దీనికి #LightALamp హ్యాష్ ట్యాగ్ ఇవ్వడం మర్చిపోకండి. తద్వారా ఈ క్యాంపెయిన్‌లో మీరూ భాగస్వాములు అవ్వండి.
ఇది కేవలం వ్యక్తులకు మాత్రమే పరిమితం కాదు, ఎన్జీఓలు, సంస్థలు, ఆర్గనైజేషన్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ పండగ వేళ జోష్ యాప్ ఒక సామాజిక బాధ్యతను తీసుకుంది. #LightALamp క్యాంపెయిన్ ద్వారా సమాజంలోని సామాజిక దురాచారాలపై పోరాటం, సమాజంలో సానుకూలత వ్యాప్తి చేసే బాధ్యత జోష్ తీసుకుంది.ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు జోష్ ఎన్జీఓ సంస్థలైన సార్థక్ ప్రయాస్, రాబిన్ హుడ్ ఆర్మీ, ఊర్జా ట్రస్ట్, కిడ్స్‌కింత,మాష్‌లతో జతకట్టింది. ఈ పండుగ వేళ మరొకరిలో ఆనందం నింపే బాధ్యత జోష్ తీసుకుంటోంది. నిరక్షరాస్యత,ఆకలి,వృద్ధుల సంరక్షణ, చిన్నారులకు విద్య, మహిళల సంక్షేమం, అసమానత,పర్యావరణ పరిరక్షణ వంటి క్లిష్టమైన సమస్యలపై పోరాటం చేసి పరిష్కరించడం ద్వారా మరొకరి దసరాను కలర్‌ఫుల్‌గా మార్చేందుకు జోష్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఆశ, కరుణ,ఐక్యతతో కూడిన ఈ సందేశాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు క్రియేటర్ల కమ్యూనిటీలతో షేర్ చేయండి.తద్వారా అవసరమైన వారికి అండగా నిలవడంలో భాగస్వాములవుదాం.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వీడియోలు చేసి #LightALamp హ్యాష్ ట్యాగ్ ఇచ్చి ప్రమోట్ చేద్దాం. ఇందుకోసం జోష్ యాప్ ఓపెన్ చేసి #LightALamp పై క్లిక్ చేయండి.

దసరా సందర్భంగా తొలిసారి జోష్ ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు పెద్ద సక్సెస్ అయ్యింది. రాబిన్ హుడ్ అనే ఎన్జీఓ సంస్థ ఇచ్చిన సపోర్ట్ మరవలేనిది. ఢిల్లీ, ముంబై,అహ్మదాబాద్ నగరాల్లో పలువురు ఈ క్యాంపెయిన్‌లో పాల్గొని సేవలందించారు. ఆ సందర్భంగా ఆహారం అందజేయడం, పిల్లలతో సమయం గడపడం,వారిలో ఆనందం నింపడం వంటివి చేశారు. ఇలాంటి హృదయాన్ని తాకే దృశ్యాలను కెమెరాలో బంధించి ఒక వీడియో చేశారు.
ఇలాంటి కార్యక్రమం జోష్‌కు మైలురాయిగా నిలిచింది. అవసరం కోసం, సహాయం కోసం ఎదురుచూస్తున్న వారిని ఆదుకుని పండగవేళ వారిలో ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని జోష్ నింపింది.ఇలాంటి కార్యక్రమాలను కలిసికట్టుగా చేయడం ద్వారా మానవత్వానికి హద్దు లేదనేది చాటుతున్నాం. ఇక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.రానున్న రోజుల్లో మరికొన్ని కార్యక్రమాలను నిర్వహించబోతున్నాం. అందులో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని సక్సెస్ చేయాలని జోష్ కోరుకుంటోంది.
ఇక అవసరాల్లో ఉన్న వారిని ఆదుకోవడం లేదా సహాయం చేసేందుకు మరో మార్గం కూడా ఉంది. కిందిస్థాయిలో పనిచేస్తున్న వాలంటీర్ల ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవ్వాలనుకున్నా లేదా మీరు మరే విధంగానైనా సహాయం చేయాలనుకున్నా మీరు ఈ కింది ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు:
కిడ్స్‌కింతా: +91 99169 53433
మాష్: 9958638627
తయియా మదిలు: +91 90603 02094












Click it and Unblock the Notifications