పాక్ చెరలో ఆంధ్రా జాలర్లు : అప్రమత్తమైన ప్రభుత్వం
సముద్రంలో చేపలు పట్టటానికి వెళ్లిన ఏపికి చెందిన 20 మంది మత్స్యకారులు పాకిస్థాన్ చెరలో చిక్కుకున్నారు. వీరం తా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన వారు. గుజరాత్ రాష్ట్రంలో తీర ప్రాంతమైన వీరావల్ నుండి వీరు చేపల వేటకు వెళ్లి..పొరపాటున పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశించారు. అక్కడి కోస్ట్ గార్డు మెరైన్ దళాలు వారిని అదుపు లోకి తీసుకున్నాయి. ఈ విషయం పై సమాచారం అందగానే ముఖ్యమంత్రి స్పందించారు. జాలర్లను విడింపచే చర్య లను తీసుకోవాలని ఏపి భవన్ అధికారులను ఆదేశించారు. దీంతో..అక్కడి భారత రాయబార కార్యాలయం తో సంప్రదింపులు మొదలయ్యాయి.
చేపల వేట కోసం గుజరాత్ సరిహద్దు దాటి తమ ప్రాంతంలోకి ప్రవేశించారనే కారణంతో తొమ్మిది మంది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులను పాకిస్థాన్ తీర రక్షక దళం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాక్ కోస్టల్ గార్డ్స్ అదుపులోకి తీసుకున్నవారిలో నలుగురు శ్రీకాకుళానికి చెందిన వారు కాగా.. మిగిలిన ఐదుగురు విజయనగరం జిల్లా పూసపాటిరేగలోని తిప్పలవలసకు చెందినవారిగా గుర్తించారు. వీరంతా ఉపాధి కోసం గుజరాత్‌కు వలస వెళ్లి అక్కడే నివసిస్తున్నారు. స్థానికంగా ఈ విషయం తెలియడంతో మంత్రి కళా వెంకట్రావు సీఎం చంద్రబాబుకు సమాచారం ఇచ్చారు.

దీంతో వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి.. పాక్ అదుపులో ఉన్న మత్స్యకారుల గురించి దిల్లీలోని ఏపీ భవన్‌లో రెసిడెంట్ కమిషనర్‌తో మాట్లాడారు. పాక్ అదుపులో ఉన్న మత్స్యకారులను తిరిగి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు పాక్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వారిని వీలైనంత త్వరగా స్వస్థలాలకు చేర్చే దిశగా చర్యలు ప్రారంభించారు.
విదేశాంగ శాఖ అధికారులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ వివరాలను బాధితు కుటుంబాలకు తెలియచేయాలని సీయం చంద్రబాబు ఆదేశించారు. బాధితులెవరూ అధైర్య పడవద్దని భరోసా కల్పించే ప్రయత్నం చేసారు.
-
AP Pensions: ఆ పెన్షన్లు తీసేశాం-తేల్చేసిన సర్కార్ ..! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
AP Job Calendar: జాబ్ క్యాలెండర్ పై కీలక అప్డేట్- సర్కార్ డెడ్ లైన్..! రేపే ఖరారు..! -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications