జగన్ పార్టీ ఓడితే.. గెలిచినా రాజీనామా చేస్తానంటూ ధర్మాన కృష్ణదాస్ షాకింగ్ కామెంట్స్

శ్రీకాకుళం: ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి, నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలోని చీడిపూడి గ్రామంలో శనివారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గెలిచినా.. ఎమ్మెల్యేకు రాజీనామా అంటూ ధర్మాన సంచలనం

గెలిచినా.. ఎమ్మెల్యేకు రాజీనామా అంటూ ధర్మాన సంచలనం


ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, అలా జరగని పక్షంలో తాను ఎమ్మెల్యేగా గెలిచినా.. రాజీనామా చేస్తానంటూ ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. ఎవరితో పొత్తులు పెట్టుకున్నా వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్.

టీడీపీ, జనసేనలకు ధర్మాన సవాల్

టీడీపీ, జనసేనలకు ధర్మాన సవాల్

జగన్ సమర్థుడైన నాయకుడని, పొత్తు లేకుండానే అన్ని స్థానాలకు పోటీ చేస్తారని ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. పొత్తులు లేకుండా టీడీపీ, జనసేన 175 స్థానాల్లో పోటీ చేయగలవా? అని ధర్మాన సవాల్ విసిరారు. మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు మేలు చేయాలని జగన్ ఆకాంక్షిస్తున్నారన్నారు. అందుకే తాము వికేంద్రీకరణ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.

రాజకీయ పరిణితి కావాలంటూ పవన్‌పై ధర్మాన కామెంట్స్

రాజకీయ పరిణితి కావాలంటూ పవన్‌పై ధర్మాన కామెంట్స్

టీడీపీ, జనసేన కేవలం 25 గ్రామాల ప్రజల కోసం పనిచేస్తున్నాయని ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడు రాజధానులు పెట్టాలని జగన్ ఆలోచిస్తుంటే.. పవన్ మాత్రం టీడీపీకి వంతపాడుతున్నారన్నారు. రాజకీయం అంటే సినిమా కాదని పరిణితి కావాలని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు రియల్ ఎస్టేట్ కుట్రలంటూ మంత్రి ధర్మాన ఫైర్

చంద్రబాబు రియల్ ఎస్టేట్ కుట్రలంటూ మంత్రి ధర్మాన ఫైర్

మరోవైపు, ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా వికేంద్రీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో సామాన్యులకు స్థానం ఉండదన్నారు. రాజధాని అంటే యాక్సప్టబులిటీ ఉండాలని, రవాణా సౌకర్యం ఉండి తీరాలన్నారు. విశాఖపట్నంలో ధనవంతుల జాబితా తీస్తే 100 మందిలో 99 మంది ఇతర ప్రాంతాలవారే ఉంటారన్నారు. ఉత్తరాంధ్రకు రాజ్యాంగబద్ధ ఆస్తులు, సంపదలు చేజారాయన్నారు. దేశంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా రాజధాని చుట్టూ మాత్రమే జరిగిందన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే టీడీపీకి అభ్యంతరమేంటని మంత్రి ధర్మాన ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఆశపడి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ మాత్రం విశాలమైన ప్రజల ప్రయోజనాలే ధ్యేయంగా ఆలోచిస్తున్నారన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు ఉత్తరాంధ్ర ద్రోహులుగా మారారని మండిపడ్డారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+