Condoms- IPL 2023: స్విగ్గీకి కండోమ్స్ గిరాకీ: ఒక్కరాత్రికే వేలల్లో డోర్ డెలివరీ- నాన్ స్టాప్ బ్యాటింగ్
అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్స్‌లో గుజరాత్ టైటాన్స్ మెరుపులు మెరిపించింది. స్టేడియంలో పరుగుల వరద పారించింది. ఊహించినట్టే భారీ స్కోర్‌ను సాధించింది. ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ల తుక్కు రేగ్గొట్టారు బ్యాటర్లు. ప్రత్యేకించి- ఫస్ట్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ అదరగొట్టాడు.
టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్ ఆరంభించింది. తన నిర్ణయం తప్పు అని తెలుసుకోవడానికి ధోనీకి ఎంతో సమయం పట్టలేదు. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్ శుభారంభాన్ని ఇచ్చారు. ప్రారంభ ఓవర్లల్లో వారిద్దరూ ధాటిగా ఆడారు. చెన్నై బౌలర్లను దడదడలాడించారు.

వారిద్దరూ అవుట్ అయిన తరువాత కూడా గుజరాత్ ఇన్నింగ్ దూకుడుకు బ్రేకులు పడలేదు. నిర్ణీత 20 ఓవర్లల్లో 214 పరుగులు చేసిందా లోకల్ టీమ్. ఈ క్రమంలో నాలుగు వికెట్లను నష్టపోయింది. ఫస్ట్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ విజృంభించాడీ మ్యాచ్‌లో. తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. చివరి ఓవర్‌లో 96 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్- 39, వృద్ధిమాన్ సాహా- 54 చేశారు. కేప్టెన్ హార్దిక్ పాండ్యా- 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
we had 368353 orders for jalebi fafda this cricket season, and we bet at least half of them are from gokuldham society pic.twitter.com/UCoe0pgrOg
— Swiggy (@Swiggy) May 29, 2023
అక్కడి పరిస్థితి ఇలావుంటే- బయట మరోలా ఉంది. కండోమ్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రోజు రాత్రి వేల సంఖ్యలో కండోమ్స్ అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ స్వయంగా వెల్లడించింది. రాత్రి 8:30 గంటల వరకు 2,324 కండోమ్స్‌ను తాము డోర్ డెలివరీ చేసినట్లు వెల్లడించింది.
ఈ మేరకు ఓ ట్వీట్ చేసిందా కంపెనీ యాజమాన్యం. ఇంకొన్ని కండోమ్స్‌ను డెలివరీ చేయాల్సి ఉన్నట్లు తెలిపింది. చూస్తోంటే 22 మంది ప్లేయర్ల కంటే ఎక్కువ మందే ఈ రాత్రికి మ్యాచ్‌లను ఆడేట్టు కనిపిస్తోందంటూ సెటైర్లు వేసింది. దీనిపై నెటిజన్లు సైతం తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. ఫ్లాట్ పిచ్‌పై నాన్ స్టాప్ బ్యాటింగ్ చేస్తోన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ పోస్ట్ చేశారు.
2423 condoms have been delivered via @SwiggyInstamart so far, looks like there are more than 22 players playing tonight 👀 @DurexIndia
— Swiggy (@Swiggy) May 29, 2023
కాగా- ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికీ తమకు 3,68,353 జిలేబీ పాపడ్ల ఆర్డర్లు లభించినట్లు స్విగ్గి మరో ట్వీట్‌లో వెల్లడించింది. ఈ ఐటమ్‌లో రికార్డుస్థాయిలో విక్రయాలు నమోదైనట్లు పేర్కొంది. ఈ ఆర్డర్లు ఎక్కువ శాతం గోకుల్ ధామ్ నుంచే వచ్చాయని స్పష్టం చేసింది. జిలేబీ పాపడ్‌ను స్నాక్స్ గా తీసుకోవడానికి గుజరాతీయులు ఇష్టపడతారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications