తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్: టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు 1000 స్పెషల్ దర్శన్ టికెట్లు
హైదరాబాద్: తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్తను అందించింది. తిరుమల వెళ్లేందుకు ఆర్టీసీ బస్ టికెట్ తోపాటు వెంకటేశ్వరస్వామి దర్శనానికి టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని శుక్రవారం(జులై 1) నుంచి వినియోగించుకోవచ్చని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
ప్రతిరోజూ వెయ్యి టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ, టీటీడీ మధ్య అంగీకారం కుదిరిందని చెప్పారు. బస్ టికెట్ రిజర్వు చేసుకునే సమయంలోనే దర్శనం టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ఆర్టీసీ వెబ్‌సైట్ లేదా అధీకృత డీలర్ ద్వారా రిజర్వు చేసుకోవచ్చని తెలిపారు.
అన్‌లైన్ లేదా టికెట్ బుకింగ్ కౌంటర్లలో ప్యాకేజీ కోసం కనీసం వారం ముందుగా టికెట్లు బుక్ చేసుకోవాలని సజ్జనార్ సూచించారు.
Introducing 1000 Tirumala Special Entry Darshan Tickets every day to TSRTC passengers wef 01.07.2022. Please avail this facility and have hassle free Darshan of Lord Balaji @puvvada_ajay@Govardhan_MLA@tsrtcmdoffice#SaturdayVibes pic.twitter.com/7ibOLmcJ58
— TSRTC (@TSRTCHQ) July 1, 2022
మరోవైపు, హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ఇంటింటికీ పార్సిళ్ల చేరవేతకు పోస్టల్ శాఖతో ఒప్పందం చేసుకున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిసారు. రెండు విభాగాల అధికారులతో గురువారం బస్ భవన్‌లో జరిగిన సమావేశంలో ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు.

హెచ్ఎండీఏ పరిధిలో 110 పిన్ కోడ్ సెంటర్లు ఉన్నాయి. తొలి దశలో 27 ప్రాంతాల్లో హోండెలివరీ పార్శిల్ సేవలను ప్రారంభిస్తామని, దశలవారీగా మిగిలిన ప్రాంతాలకు విస్తారిస్తామని సజ్జనార్ తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల ద్వారా రోజుకు 18వేలకుపైగా పార్సిళ్లను చేరవేస్తున్నమాని వివరించారు.