10th hindi Paper leak: నిన్న తెలుగు పేపర్ లీక్.. నేడు హిందీ పేపర్..!
తెలంగాణలో పేపర్ల లీక్ ఆగడం లేదు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ తో పాటు తాజాగా టెన్త్ పేపర్ల లీక్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. వికారాబాద్ జిల్లాలో సోమవారం తెలుగు పేపర్ లీక్ కాగా.. తాజాగా వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు హిందీ పేపర్ వాట్సాప్ గ్రూప్ ల్లో చక్కర్లు కొట్టినట్లు కొందరు చెబుతున్నారు. వరుస పేపర్ల లీక్ తో విద్యార్థులు, తల్లిదందడ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై కలెక్టర్ సీరియస్ గా స్పందించినట్లు తెలిసింది. పేపర్ లీక్ కు సంబంధించి విచారణ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. సోమవారం వికారాబాద్ జిల్లా తాండూరులో పదో తరగతి తెలుగు పరీక్ష లీక్ అయింది. పేపర్ లీక్ లో ముగ్గురు అధికారులు సూపరింటెండెంట్, డిపార్ట్ మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్ ను సస్పెండ్ చేశారు.

కాగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే చాలా మంది నిందితులను సిట్ విచారించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ప్రవీణ్, రాజశేకర్ రెడ్డి, రేణుక, డాక్యా, షమీమ్, రమేశ్ తో పాటు మరికొందరు ఉన్నారు.
హిందీ పేపర్ లీక్ పై వరంగల్ సీపీ రంగనాథ్ మాట్లాడారు. వాట్సాప్ లో పేపర్ వైరల్ కావడంపై విచారణ చేపడుతున్నామన్నారు. చెప్పారు. ఇలా అయితే పేపర్ లీకైనట్లు కాదని, ఎగ్జామ్ స్టార్ట్ అయిన గంటన్నర తర్వాత పేపర్ బయటకు వచ్చిందని తెలిపారు.
పేపర్ ఎలా బయటకు వచ్చిందో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications