హైదరాబాద్‌లో ఒక్క రాత్రికి ఇన్ని కేసులా?
Happy New Year 2025: కొత్త ఏడాది ఆరంభమైంది. 2025లోకి అడుగు పెట్టాయి ప్రపంచదేశాలు. ఒక్కో దేశం ఒక్కో విధంగా నూతన సంవత్సర వేడుకలను జరుపుకొంటోన్నాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు కోట్లాదిమంది మేల్కొనే ఉన్నారు. కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు.
అర్ధరాత్రి 12 గంటలు కాగానే దేశవ్యాప్తంగా కొత్త ఏడాది ఉత్సవాలు మిన్నంటాయి. బాణాసంచా కాల్చుతూ సందడి చేశారు జనం. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ.. వంటి నగరాల్లో పండగ వాతావరణం నెలకొంది. కేక్ కట్ చేస్తూ కోలాహలంగా గడిపారు ప్రజలు.

ఇక హైదరాబాద్‌లో మందుబాబులు ఫూటుగా తాగి పెట్టారు. విచ్చలవిడిగా బైక్‌లను నడిపారు. ఇష్టారాజ్యంగా గడిపారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఏకంగా వెయ్యికి పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయంటే మందుబాబులు ఏ రేంజ్‌లో చెలరేగిపోయారో అర్థం చేసుకోవచ్చు.
ఒక్క హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1,184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయ. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రికార్డయిన కేసులు దీనికి బోనస్. అక్కడ 619 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్‌లో ఈస్ట్ జోన్‌లో అత్యధికంగా 270 కేసులు నమోదు అయ్యాయి.
సౌత్ ఈస్ట్- 192, వెస్ట్ జోన్- 179, సౌత్ వెస్ట్- 179, నార్త్ జోన్- 177, సౌత్ జోన్- 119, సెంట్రల్ జోన్- 102 కేసులను పోలీసులు నమోదు చేశారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎల్బీనగర్ డివిజన్‌లో అత్యధికంగా 232, మల్కాజ్‌గిరి-230, భువనగిరి- 84, మహేశ్వరం- 47 కేసులు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో వయస్సు రీత్యా చూసుకుంటే 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్లు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన కేసులు రెండే. 18 నుంచి 20- 12, 21 నుంచి 30- 262, 31 నుంచి 40- 201, 41 నుంచి 50- 109, 51 నుంచి 60- 30, 61 నుంచి 70- మూడు కేసులు రకార్డయ్యాయి. తాగి టూ వీలర్లు నడిపిన వాళ్లు 526, త్రీ వీలర్లు- 26, ఫోర్ వీలర్లు- 64, లారీ/ట్రక్కులు నడిపిన వాళ్లు ముగ్గురు ఉన్నారు.












Click it and Unblock the Notifications