రెసిడెన్షియల్ స్కూల్లో 12 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య, అనుమానాలు
జీడిమెట్లలో 12 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్నాడు. జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని టీఎస్‌ఐఐసీ కాలనీలో ఈ మైనార్టీ గురుకుల పాఠశాల ఉంది.
హైదరాబాద్: జీడిమెట్లలో 12 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్నాడు.
జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని టీఎస్‌ఐఐసీ కాలనీలో ఈ మైనార్టీ గురుకుల పాఠశాల ఉంది. ఇందులో ఫక్రూద్దీన్ అనే విద్యార్థి ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.

అతను మంగళవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసకున్నాడు. పాఠశాల సిబ్బంది సంఘటనా వివరాలను పోలీసులకు, కుటుంబ సభ్యులకు చెప్పకుండానే మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించడం అనుమానాలకు తావిస్తోంది.
మృతదేహంపై గాయాలు ఉండటంతో ఉపాధ్యాయులు తీవ్రంగా దండించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయని బంధువులు ఆరోపిస్తున్నారు.
ఫక్రూద్దీన్ గాంధీనగర్ పరిధి వెంకట్రామిరెడ్డి నగర్‌కు చెందిన నాజీమొద్దీన్, అక్తర్ బేగంల కొడుకు. భర్త మృతిచెందడంతో అక్తర్ బేగం కుమారుడిని గురుకుల పాఠశాలలో చేర్చించింది.












Click it and Unblock the Notifications
