తెలంగాణలో కొత్తగా 1213 కరోనా పాజిటివ్ కేసులు... మరో 8 మంది మృతి...

తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పైపైకి ఎగబాకుతూనే ఉంది. గురువారం 1,213 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 8 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 18,570కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 275కి చేరింది.

ఇప్పటివరకూ 9,069 పేషెంట్లు కరోనా మంది డిశ్చార్జి కాగా... ప్రస్తుతం రాష్ట్రంలో 9,226 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 5,356 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 1,213 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో 4,143 మందికి నెగెటివ్ వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 98,153 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.

1213 new coronavirus cases and 8 deaths reported in telangana

తాజాగా నమోదైన కేసుల్లోనూ అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 998 కేసులు నమోదయ్యాయి. ఇక మేడ్చల్‌లో 54, రంగారెడ్డిలో 48, ఖమ్మంలో 18, వరంగల్ రూరల్‌లో 10, వరంగల్ అర్బన్‌లో 9, నల్గొండలో 8, భద్రాద్రిలో 7, సిరిసిల్లలో 6, కరీంనగర్‌లో 5, నిజామాబాద్‌లో 5, ములుగు, నిర్మల్‌లో 4 చొప్పున, నారాయణపేట, కామారెడ్డిలో 2 చొప్పున, గద్వాల్, సిద్దిపేట, మెదక్, యాదాద్రి, నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.

Recommended Video

    Ravikumar మరణం పై స్పందించిన Chest Hospital వర్గాలు! || Oneindia Telugu

    కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తారా అన్న చర్చ జరుగుతోంది. దీనిపై కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ... ఇప్పటికైతే కేబినెట్ భేటీపై ఎటువంటి స్పష్టత లేదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+