దండకారణ్యంలో తుపాకుల మోత; 13 మంది మావోయిస్టుల ఏరివేత!!
దండకారణ్యం తుపాకుల మోతతో హోరెత్తింది. మావోయిస్టులను టార్గెట్ చేసి ఏరివేత చేపట్టిన భద్రతా బలగాలు నిన్న ఉదయం నుండి సాగించిన ఎన్కౌంటర్ లో మొత్తం 13 మందిని మట్టుబెట్టాయి. ఛత్తీస్ గడ్ లోని బస్తర్ రీజియన్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య 13కు పెరిగింది. బీజాపూర్ జిల్లా కొర్చోలి అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం ప్రారంభం అయిన ఎదురుకాల్పులు 10 గంటలపాటు సాగింది.
బీజాపూర్ అటవీ ప్రాంతంలో మావోలకు భద్రతా బలగాలకు భీకర పోరు
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో జరిగిన ఈ ఎన్కౌంటర్ మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్ అని చెప్పాలి.పోలీసు ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం బీజాపూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ప్లీనరీ నిర్వహిస్తున్నట్టు సమాచారం అందటంతో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు డీఆర్జీ బృందాలు, సీఆర్పీఎఫ్, కోబ్రా, బస్తర్ ఫైటర్స్, ఛత్తీస్ గడ్ ఆర్మ్డ్ ఫోర్స్ భద్రతా బలగాలు గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతాన్ని చుట్టుముట్టాయి.

10 గంటలపాటు హోరాహోరీగా..
అక్కడ మావోయిస్టులతో తారసపడటంతో మావోలు భద్రతా బలగాలపై కాల్పులు జరిపాయి. దీంతో భద్రాతా బలగాలు జరిపిన ఎదురు కాల్పులలో మొత్తం 13 మంది నక్సలైట్లు నేలకొరిగారు. మొత్తం 10 గంటలపాటు హోరాహోరీగా సాగిన భీకర పోరాటంలో 13 మందిని హతమార్చటంతో పాటు, భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుండి ఇన్సాన్, ఎల్ ఎం జి వంటి ఆటోమేటిక్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కొనసాగుతున్న కూంబింగ్
ఇంకా దండకారణ్యంలో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పటికి 13 మంది మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. తాజా ఎన్కౌంటర్ లో డీవీసీ మెంబర్ క్రాంతి ముచతో పాటుమరో కీలక సభ్యుడు పాపారావు మృతి చెందినట్టు ప్రాధమిక సమాచారం. అయితే మృతి చెందిన వారే కాకుండా భారీ సంఖ్యలో మావోయిస్టులు గాయాల పాలైనట్టు సమాచారం.ఇక వారి కోసం కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది.
ఇప్పటివరకు బస్తర్ రీజియన్ లో ఇటీవల భారీ సంఖ్యలో మావోలు మృతి
కాగా, గత నెల 27న ఇదే బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇక నిన్న 8 మంది మృతి చెందినట్టు ప్రకటించగా నేడు మృతుల సంఖ్య 13కు చేరింది. కాగా ఇప్పటివరకు బస్తర్ రీజియన్ లో జరిగిన యాంటీ నక్సల్ ఆపరేషన్ లో మొత్తం 45 మంది మావోయిస్టులు మృతి చెందారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications