ఘోరం: ఇంటి ముంగిట ముగ్గేస్తున్న బాలిక కిడ్నాప్.. గదిలో నిర్బంధించి.. ఆపైన..

నగరంలో ఘోరం జరిగింది! ఉదయం పూట వాకిట్లో ముగ్గేస్తున్న బాలికను అపహరించిన ఓ యువకుడు ఆమెను గదిలో నిర్బంధించి దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టాడు! అనంతరం బాలికను అదే గదిలోనే ఉంచి తాళం వేసి పారిపోయాడు.

హైదరాబాద్‌: నగరంలో ఘోరం జరిగింది! ఉదయం పూట వాకిట్లో ముగ్గేస్తున్న బాలికను అపహరించిన ఓ యువకుడు ఆమెను గదిలో నిర్బంధించి దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టాడు! హైదరాబాద్‌ దుండిగల్‌ పరిధిలోని సూరారం కాలనీలో ఆలస్యంగా వెలుగుచూసిందీ ఘటన.

నిందితుడు ఒడిగట్టిన దారుణాలపై బాధిత బాలిక పోలీసుల ఎదుట కన్నీటి పర్యంతమైంది. బాధితురాలు, పోలీసుల వివరాల ప్రకారం.. సూరారం కాలనీకి చెందిన బాలిక (13) మంగళవారం ఉదయం తమ ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా మహేశ్‌ అనే యువకుడు అక్కడికి వచ్చి ఆమెను అపహరించాడు.

 13-year-old girl Kidnapped and Raped


ఓ గదిలో నిర్బంధించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను అదే గదిలోనే ఉంచి తాళం వేసి పారిపోయాడు. బాలిక కేకలు వేయడంతో గమనించిన ఓ వ్యక్తి దుండిగల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు బుధవారం బాలికను స్టేషన్‌కు తీసుకెళ్లి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.

గతంలోనూ మహేశ్‌ తనను వేధింపులకు గురిచేశాడని చెబుతూ ఆమె పోలీసుల విచారణలో కన్నీటిపర్యంతమైంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మహేశ్‌పై అత్యాచారం, వేధింపుల కేసు నమోదు చేసినట్టు సీఐ శంకరయ్య తెలిపారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+