తెలంగాణలో కొత్తగా 1451 కరోనా కేసులు.. మరో 9 మంది మృతి...

తెలంగాణలో గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1451 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 1174 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మరో 9 మంది కరోనాతో మృతి చెందారు. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం (అక్టోబర్ 17) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,20,675కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1256కి చేరింది. ప్రస్తుతం 22,774 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. మరో 18,905 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 1983 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,96,636 కి చేరింది.

1451 new coronavirus cases and 9 deaths reported from telangana

గడిచిన 24గంటల్లో మొత్తం 42,497 శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 37,89,460కి చేరింది. ఒక మిలియన్ జనాభాకు సగటున 1,01,812 కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.5శాతం ఉండగా... తెలంగాణలో 0.57శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 87.5శాతం ఉండగా తెలంగాణలో 89.1శాతం ఉన్నట్లు తెలిపారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 235 కేసులు నమోదవగా... రంగారెడ్డి జిల్లాలో 104,మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 101,భద్రాద్రి కొత్తగూడెంలో 92 కేసులు నమోదయ్యాయి.

Recommended Video

    G Kishan Reddy @AIIMS - ఎయిమ్స్ నిర్మాణానికి భూమి కేటాయించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు!!

    ఇక శుక్రవారం(అక్టోబర్ 16) రాష్ట్రంలో 1554 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. మరో 7 మంది కరోనాతో మృత్యువాతపడ్డ సంగతి తెలిసిందే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+