కరోనా అప్‌డేట్ : తెలంగాణలో కొత్తగా 147 కేసులు... దేశంలో కొత్తగా 12,689 కేసులు

తెలంగాణలో కొత్తగా 147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరొకరు కరోనాతో మృతి చెందారు. మరో 228 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం (జనవరి 27) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,737కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1,593కి చేరింది. ప్రస్తుతం 2,819 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. 1593 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 399 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,89,325 చేరింది.

147 new coronavirus cases in telangana india records 12,689 new cases

గడిచిన 24 గంటల్లో 16,486 కరోనా టెస్టులు చేశారు. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 77,28,296కి చేరింది. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.4శాతం ఉండగా... తెలంగాణలో 0.54శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 96.9శాతం ఉండగా తెలంగాణలో 98.49 శాతం ఉన్నట్లు తెలిపారు. తాజాగా అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 32 కేసులు మోదయ్యాయి.

ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,689 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,89,527కి చేరింది.మరో 137 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,53,724కు చేరింది. ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,03,59,305కి చేరింది. ప్రస్తుతం 1,76,498 మంది ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 20,29,480 మందికి వ్యాక్సిన్లు వేశారు.

దేశంలో నిన్నటి వరకు మొత్తం 19,36,13,120 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 5,50,426 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+