సన్మానం, అవార్డు: సైబరాబాద్‌లో 'గుడ్ సిటిజన్స్' వీరే (ఫోటోలు)

హైదరాబాద్: పోలీసులను ఇబ్బందులకు గురిచేసిన పెట్టించిన కేసులలో కీలక సమాచారం అందించారు. ప్రమాదాల్లో మరణించిన వారి మృతదేహాలను తరలించడంలో సహాయం చేశారు. మత కలహాలకు దారితీసే పరిస్థితులను చాకచక్యంగా వ్యవహారించి సద్దుమణిగేలా చేశారు.

అంతేకాదు క్రైం కంట్రోల్‌తో పాటు క్రిమినల్స్‌ను పట్టించే అంశాన్ని తమ బాధ్యతగా భావించారు. సమయం దొరికితే ట్రాఫిక్ విధుల్లో చేరే సాప్ట్‌వేర్ ఉద్యోగులు, అలా పౌరులుగా తమ బాధ్యతలను నిర్వర్తించి పోలీసులకు సహాకారం అందించిన పౌరుల సహాకారాన్ని గుర్తించిన సైబరాబాద్ సీపీ వారికి గుడ్ సిటిజన్స్ ప్రశంస పత్రంతో పాటు వెయ్యి రూపాయల నగదును అవార్డు కింద అందించారు.

ఈ విధంగా సివిల్ పోలీసు విధులను నిర్వహించిన 15 మంది పౌరులను సైబరాబాద్ పోలీసులు ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ వీరిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూనేర నియంత్రణలో తమ బాధ్యతను నిర్వహించాలని సీపీ పిలుపునిచ్చారు.

 సైబరాబాద్‌లో 'గుడ్ సిటిజన్స్' వీరే

సైబరాబాద్‌లో 'గుడ్ సిటిజన్స్' వీరే


కట్ట సంతోష్ ఇచ్చిన సమాచారంతో సైబరాబాద్ పోలీసులు ఓ వృద్ధుడి హత్య కేసును చేధించారు. మొదట ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుల గుర్తించి ఎలాంటి క్లూ లభించలేదు. సంతోష్ ఇచ్చిన సమాచారంతో ముగ్గురు నిందితులు పోలీసులకు దొరికిపోయారు.

సైబరాబాద్‌లో 'గుడ్ సిటిజన్స్' వీరే

సైబరాబాద్‌లో 'గుడ్ సిటిజన్స్' వీరే


మహ్మద్ మహమూద్ చేసిన సాహసంతో ముగ్గురు కరుడుఘట్టిన దొంగలు పోలీసులకు దొరికిపోయారు. ఓ ఇంట్లో దొంగతనం చేసి పారిపోతుండగా మహమూద్ ధైర్యం చేసి స్థానికుల సహాయంతో సయ్యద్ వాజిద్, అఫ్రోజ్ ఖాన్, ఎండీ అసీఫ్‌లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వీరి విచారణలో పోలీసులకు ఎనిమిది దొంగతనాల కేసుల మిస్టరీ వీడింది.

 సైబరాబాద్‌లో 'గుడ్ సిటిజన్స్' వీరే

సైబరాబాద్‌లో 'గుడ్ సిటిజన్స్' వీరే


సయ్యద్ జహీరుద్దీన్ జగద్గీరుగుట్ట పరిధిలో ఇంట్లో దొంగతనానికి పాల్పడి సొత్తుతో పారిపోతున్న దొంగ కొమిరి రాములును పోలీసులకు పట్టించాడు. అదే విధంగా మరికొన్ని కేసుల్లో కీలక సమాచారాన్ని అందించి పోలీసులకు సహకరించాడు.

సైబరాబాద్‌లో 'గుడ్ సిటిజన్స్' వీరే

సైబరాబాద్‌లో 'గుడ్ సిటిజన్స్' వీరే


రాజేష్ రాథోడ్ సమాచారంతో మల్కాజిగిరి రైల్వే క్వార్టర్స్ ప్రాంతంలో జరిగిన ఛైన్ స్నాఛింగ్‌లో స్నాఛర్స్ ఉపయోగించిన బైక్ నెంబరును పోలీసులకు ఇచ్చి కీలకపాత్ర పోషించారు. రాజేష్ రాథోడ్ ఇచ్చిన బైక్ నెంబరుతో పోలీసుల స్నాచర్‌లు గోవికర్ నవీన్‌లాల్ అలియాస్ చింటూ, మహ్మద్ ఖలీల్ షరీఫ్‌లను పోలీసులు పట్టుకుని పలు స్నాచింగ్ మిస్టరీలను బయటపెట్టారు.

 సైబరాబాద్‌లో 'గుడ్ సిటిజన్స్' వీరే

సైబరాబాద్‌లో 'గుడ్ సిటిజన్స్' వీరే


కుక్కల నరేందర్, ఉప్పరీ సురేష్‌లు ఎన్‌హెచ్-44 రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారిని తమసోంత వాహనాల్లో ఆసుపత్రికి తరలిస్తూ ప్రాణాలను కాపాడుతున్నారు. అదే విధంగా స్థానికంగా శాంతి భద్రతల నిర్వహణలో పోలీసులతో భాగస్వామ్యమవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+