తెలంగాణలో కొత్తగా 1536 కరోనా కేసులు.. మరో ముగ్గురు మృతి...

తెలంగాణలో కొత్తగా 1536 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. మరో 617 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం (నవంబర్ 3) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Recommended Video

    Corona Virus Second Wave : Cases May Increase During Diwali, Says Experts | Oneindia Telugu

    తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,42,506కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1351కి చేరింది. ప్రస్తుతం 17,742 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. మరో 14,915 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 1421 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,23,413కి చేరింది.

    1536 new coronavirus cases and 3 deaths reported from telangana

    సోమవారం రాత్రి 8గంటల వరకు మొత్తం 45,021 శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 43,94,330కి చేరింది. ఒక మిలియన్ జనాభాకు సగటున 1,18,063 కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.5శాతం ఉండగా... తెలంగాణలో 0.55శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 91.7శాతం ఉండగా తెలంగాణలో 92.12శాతం ఉన్నట్లు తెలిపారు.

    ఆదివారం(నవంబర్ 1) రాత్రి 8గంటల వరకు 922 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు సోమవారం(నవంబర్ 2) బులెటిన్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆదివారంతో పోల్చితే సోమవారం నాటికి కేసుల మళ్లీ పెరిగింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+