తెలంగాణలో మరోసారి భారీగా పెరిగిన కరోనా కేసులు: 24గంటల్లో 9 మరణాలు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ మరింతగా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1550 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36,221కి చేరింది.

గత 24 గంటల్లో 11,525 పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు మొత్తంగా 1,81,849 పరీక్షలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,178 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య వాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 23,679 మంది డిశ్చార్జ్ కాగా, సోమవారం 1197 మంది కోలుకున్నారు.

 1550 new corona positive cases recorded in telangana: 9 new deaths.

రాష్ట్రంలో కరోనాబారిన పడి సోమవారం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 365 మంది ఇప్పటి వరకు మరణించారు. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 926 కేసులు నమోదయ్యాయి. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి 212, కరీంనగర్ 86, మేడ్చల్ నుంచి 53, నల్గొండలో 41, సంగారెడ్డి 19, ఖమ్మం 38, కామారెడ్డి33, వరంగల్ అర్బన్ 16 కేసులు ఉన్నాయి.

ఇక దేశ వ్యాప్తంగానూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 9,06,612 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,10,926 యాక్టివ్ కేసులున్నాయి. 5,71,578 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 23,727 మంది మరణించారు.

Recommended Video

    Russia Successfully Complete Human Trials Of Coronavirus Vaccine || Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+