దారుణం: అత్యాచారం ఆపై బ్లాక్ మెయిలింగ్... పోక్సో చట్టం కింద బాలుడిపై కేసు నమోదు
నిజామాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఓ బాలికపై 17ఏళ్ల కుర్రాడు క్రూరత్వం ప్రదర్శించాడు. బాలికను లొంగదీసుకుని అత్యాచారం చేసి ఆపై బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డాడు.
నిజామాబాద్‌లో 10వ తరగతి చదువుతున్న ఓ బాలికతో ఈ 17 ఏళ్ల కుర్రాడు స్నేహం చేశాడు. కొద్ది రోజులు వరకు వీరి స్నేహం బాగానే సాగింది. ఆరు నెలల క్రితం బాలిక పుట్టిన రోజు పురస్కరించుకుని ఆమెను నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి బాలుడి మిత్రుల సమక్షంలో ఆమెతో కేక్ కట్ చేయించాడు. ఈ వేడుకలన్నీ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. అనంతరం ఈ వీడియోను అందరికీ చూపిస్తానని చెప్పి అమ్మాయిని లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు.
బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లి ఈ వీడియోలను చూపించి బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఇక తప్పని పరిస్థితుల్లో బాలిక అతడికి లొంగిపోయింది. అదే సమయంలో సెల్ఫీ వీడియోలు కూడా తీసి తన మిత్రులకు వాట్సాప్‌లో షేర్ చేశాడు. ఏప్రిల్ 25న బాలిక ఒంటరిగా ఉండటాన్ని చూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ వీడియోను కూడా అతడి స్నేహితులకు వాట్సాప్‌లలో షేర్ చేశాడు.

కొద్ది రోజుల క్రితం బాలిక తండ్రి ఫోన్‌ను ఎవరో దొంగలించడంతో ఆయన మరో సిమ్ ఉన్న ఫోన్‌ను వాడుతున్నారు. అదే సమయంలో బాలుడు ఆ నెంబర్‌కు ఫోన్ చేయడంతో అనుమానం వచ్చిన తండ్రి ఆ బాలుడిని ఆరా తీశాడు. అప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే ఆ వీడియోలను డిలీట్ చేయమని హెచ్చరించాడు. బాలుడు వినకపోవడంతో అతడి నుంచి ఆ ఫోన్ తీసుకుని ,మరో మొబైల్ షాపుకు వెళ్లి అన్‌లాక్ చేయించాడు. అందులోని వీడియోలను ఫోటోలను చూసి బాలిక తల్లిదండ్రులు కంటతడి పెట్టుకున్నారు.
జరిగిన ఘటనపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని సీజ్ చేసి బాలుడిపై అత్యాచారం పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications