తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు, టెస్టులు కూడా: ఎనిమిది జిల్లాల్లో కొత్త కేసుల్లేవ్!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఒక్కోరోజు కేసులు స్వల్పంగా పెరగడం, తగ్గడం జరుగుతోంది. గత 24 గంటల్లో 34,200 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 170 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.

తెలంగాణలో కొత్తగా 170 కరోనా కేసులు, మరణాల్లేవ్

తెలంగాణలో కొత్తగా 170 కరోనా కేసులు, మరణాల్లేవ్

తాజాగా, నమోదైన 170 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,65,068కు చేరింది. కరోనాతో కొత్తగా మరణాలు సంభవించలేదు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3912గా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 470 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

తెలంగాణలో 4612 యాక్టివ్ కేసులు

తెలంగాణలో 4612 యాక్టివ్ కేసులు

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 259 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,56,544కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4612 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో

రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది. కాగా, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 14,88,945 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 28,326 కొత్త కేసులు నమోదయ్యాయి. 260 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 4,46,918కి చేరింది. గత 24 గంటల్లో 26,032 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,03,476 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

Recommended Video

    గణేష్ నిమజ్జనోత్సవానికి రావడం ఆనందంగా ఉందన్న భక్తులు!!
    తెలంగాణలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

    తెలంగాణలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

    తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 02, భద్రాద్రి కొత్తగూడెంలో 02, జీహెచ్ఎంసీలో 68. జగిత్యాలలో 02, జనగామలో 02, జయశంకర్ భూపాలపల్లిలో 01, జోగులాంబ గద్వాలలో 00, కామారెడ్డిలో 00, కరీంనగర్‌లో 18, ఖమ్మంలో 05, కొమురంభీం ఆసిఫాబాద్ లో 00, మహబూబ్‌నగర్‌లో 04, మహబూబాబాద్‌లో 03, మంచిర్యాలలో 04, మెదక్‌లో 01, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 06, ములుగులో 02, నాగర్ కర్నూలులో 00, నల్గొండలో 10, నారాయణపేటలో 00 నిర్మల్‌లో 00, నిజామాబాద్‌లో 00, పెద్దపల్లిలో 01, రాజన్న సిరిసిల్లలో 02, రంగారెడ్డిలో 11, సంగారెడ్డిలో 03, సిద్దిపేటలో 04, సూర్యాపేటలో 05, వికారాబాద్ లో 02, వనపర్తిలో 00, వరంగల్ రూరల్‌లో 04, వరంగల్ అర్బన్‌లో 06, యాదాద్రి భువనగిరిలో 02 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కొమరంభీం అసిఫాబాద్, నాగర్ కర్నూలు,నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, వనపర్తి జిల్లాలో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+