కరోనా అప్‌డేట్ : తెలంగాణలో కొత్తగా 186 కేసులు... దేశంలో కొత్తగా 11,666 కేసులు

తెలంగాణలో కొత్తగా 186 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరొకరు కరోనాతో మృతి చెందారు. మరో 494 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం (జనవరి 28) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,923కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1,594కి చేరింది. ప్రస్తుతం 2,698 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. 1213 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 306 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,89,631కి చేరింది.

186 new coronavirus cases in telangana and india records 11,666 new cases

గడిచిన 24 గంటల్లో 31,119 కరోనా టెస్టులు చేశారు. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 77,59,415కి చేరింది. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.4శాతం ఉండగా... తెలంగాణలో 0.54శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 96.9శాతం ఉండగా తెలంగాణలో 98.53 శాతం ఉన్నట్లు తెలిపారు. తాజాగా అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 35 కేసులు మోదయ్యాయి.

ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,666 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,01,193కి చేరింది.మరో 123మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,53,724కు చేరింది. ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,03,73,606కి చేరింది. ప్రస్తుతం 1,73,740 మంది ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 23,55,979 మందికి వ్యాక్సిన్లు వేశారు.

దేశంలో నిన్నటి వరకు మొత్తం 19,43,38,773 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. బుధవారం(జనవరి 27) 5,50,426 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+