తెలంగాణలో కొత్తగా 193 కరోనా కేసులు: స్వల్పంగా పెరిగిన రికవరీ, ఆ ఐదు జిల్లాల్లో కొత్త కేసులు సున్నా

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు కేసులు ఎక్కువ తక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా 42,367 మంది నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 193 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.

తాజాగా, నమోదైన 193 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,69,932కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3944గా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 1848 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

193 new corona cases, 1 death reported in telangana state, in last 24 hours

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 196 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,62,025కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3963 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.13 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 02, భద్రాద్రి కొత్తగూడెంలో 09, జీహెచ్ఎంసీలో 64. జగిత్యాలలో 09, జనగామలో 01, జయశంకర్ భూపాలపల్లిలో 00, జోగులాంబ గద్వాలలో 00, కామారెడ్డిలో 02, కరీంనగర్‌లో 20, ఖమ్మంలో 14, కొమురంభీం ఆసిఫాబాద్ లో 00, మహబూబ్‌నగర్‌లో 01, మహబూబాబాద్‌లో 03, మంచిర్యాలలో 08, మెదక్‌లో 01, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 09, ములుగులో 01, నాగర్ కర్నూలులో 01, నల్గొండలో 09, నారాయణపేటలో 00, నిర్మల్‌లో 01, నిజామాబాద్‌లో 01, పెద్దపల్లిలో 02, రాజన్న సిరిసిల్లలో 02, రంగారెడ్డిలో 14, సంగారెడ్డిలో 01, సిద్దిపేటలో 02, సూర్యాపేటలో 03, వికారాబాద్ లో 00, వనపర్తిలో 01, వరంగల్ రూరల్‌లో 01, వరంగల్ అర్బన్‌లో 09, యాదాద్రి భువనగిరిలో 02 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కొమరంభీం అసిఫాబాద్, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

Recommended Video

    Germany: Pilots Return To Work To Cover Tourism Demand

    మరోవైపు, దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ముందు రోజు 18వేలకు పెరిగిన కరోనా కేసులు తాజాగా, 14 శాతం తగ్గాయి. మరణాలు మాత్రం 200పైనే నమోదయ్యాయి. శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 13,24,263 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా.. 15,786 మంది కరోనా బారినపడినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.41 కోట్లు దాటింది. గురువారం 231 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటి వరకు మహమ్మారి బారినపడి మరణించినవారి సంఖ్య 4.53లక్షలకు చేరింది. తాజాగా, 18,641 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి క్షేమంగా బయటపడినవారి సంఖ్య 3.35 లక్షల మందికిపి చేరింది. రికవరీ రేటు 98.16 శాతానికి చేరింది. కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం దేశంలో 1,75,745 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 0.51 శాతానికి తగ్గింది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. గురువారం 61,27,277 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 100కోట్లు దాటింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+