తెలంగాణలో కరోనా విలయం: 1986 పాజిటివ్ కేసులు నమోదు, 14 మంది మృత్యువాత..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం 1811 మందికి వైరస్ సోకగా.. గురువారం ఆ సంఖ్య 1986కి చేరింది. ఒకరోజులో ఇన్ని కేసులు నమోదవడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అని బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ తెలిపింది.

1986 పాజిటివ్ కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 62 వేల 703కి చేరింది. వైరస్ తగ్గడంతో 816 మందిని డిశ్చార్జ్ చేశారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 45,388కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,796 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇందులో 10,632 వేల మంది హోం కార్వంటైన్, ఇనిస్టిట్యూషనల్ ఐసోలేషన్‌లో ఉన్నారు.

1986 corona cases are register in the telangana state

21,380 మందికి పరీక్షలు నిర్వహించామని.. ఇంకా 1,216 మంది ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 4,37,582 మందికి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. గత 24 గంటల్లో వైరస్‌తో 14 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 519కి చేరింది. గ్రేటర్ పరిధిలో కాస్త కేసులు పెరిగి 586 నమోదయ్యాయి.

గ్రేటర్‌లో నిన్న 521 కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజుల నుంచి బల్దియా పరిధిలో 500 నుంచి 600 లోపు కేసులు వస్తున్నాయి. కానీ సమీపంలో గల మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం వందకు పైచిలుకు కేసులు వస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో కూడా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

Recommended Video

    తల్లిదండ్రులని ఒకే రోజు లో కోల్పోయిన యువకుడు | Private Hospitals దుర్మార్గం || Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+