డిస్కో బాబా అరెస్ట్: వజ్రాలు, బంగారం స్వాధీనం(పిక్చర్స్)
హైదరాబాద్: ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్న ఓ దొంగ బాబాను షాహినాయత్‌గంజ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి రూ.3. 75లక్షల విలువ చేసే రెండు ద్విచక్ర వాహనాలు, వజ్రాలు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
మంగళవారం పశ్చిమ మండలం డిసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిసిపి వెంకటేశ్వరరావు, గోషామహల్ ఏసిపి రాంభూపాల్‌రావు, షాహినాయత్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, ఎస్‌ఐ మట్టం రాజు వివరాలను వెల్లడించారు. టప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన మాజీ రౌడీషీటర్ అన్వరుల్లాఖాన్ అలియాస్ డాక్టర్ అన్వర్‌ఖాన్ డిస్కోబాబా పేరుతో మంత్రగాడి అవతారమెత్తాడు.
ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, వారి ఇళ్లల్లోకి వెళ్లి తన జేబులో సిద్ధంగా ఉంచుకున్న నకిలీ బంగారు ఇటుకలను వారికి కనిపించకుండా పడేసేవాడు. ఇంట్లో కలియ తిరిగి అవి ఇంటి వారికి కనిపించేలా కనికట్టు చేసేవాడు. ఇలాంటి బంగారం మీ ఇంట్లో పుష్కలంగా ఉందని, దాన్ని మంత్రాలతో, పూజలతో బయటకు తీస్తానంటూ రూ.70వేల నుంచి లక్ష వరకూ వసూ లు చేసేవాడు.
ఈ విధంగా షాహినాయత్‌గంజ్, కుల్సుంపురా, హబీబ్‌నగర్, ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో పలువురిని మోసం చేశాడు. డిస్కో బాబా మోసాలపై చుడిబజార్ ప్రాంతానికి చెందిన షేక్ ఖాలేద్ ఫిర్యాదు చేయడంతో మంగళవారం షాహినాయత్‌గంజ్ పోలీసులు అన్వరుల్లాఖాన్‌ను అరెస్టు చేశారు.

డిస్కో బాబా అరెస్ట్
ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్న ఓ దొంగ బాబాను షాహినాయత్‌గంజ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

డిస్కో బాబా అరెస్ట్
నిందితుడి వద్ద నుంచి రూ.3. 75లక్షల విలువ చేసే రెండు ద్విచక్ర వాహనాలు, వజ్రాలు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

డిస్కో బాబా అరెస్ట్
మంగళవారం పశ్చిమ మండలం డిసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిసిపి వెంకటేశ్వరరావు, గోషామహల్ ఏసిపి రాంభూపాల్‌రావు, షాహినాయత్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, ఎస్‌ఐ మట్టం రాజు వివరాలను వెల్లడించారు.

డిస్కో బాబా అరెస్ట్
టప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన మాజీ రౌడీషీటర్ అన్వరుల్లాఖాన్ అలియాస్ డాక్టర్ అన్వర్‌ఖాన్ డిస్కోబాబా పేరుతో మంత్రగాడి అవతారమెత్తాడు.












Click it and Unblock the Notifications