సెంట్రల్ వర్సిటీలో దారుణం: జింక కాల్చివేత, మాంసం ఇదే (ఫోటోలు)
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయు)లో దారుణం చోటు చేసుకుంది. యూనివర్సిటీ షూటింగ్ రేంజ్‌లో కోచ్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి జింకను వేటాడి, తుపాకీతో కాల్పిచ చంపాడు. తలను వేరు చేసి, చర్మం వలిచి, మాంసాన్ని ఒక గదిలో దాచి పెట్టాడు.
షూటింగ్ ప్రాక్టీస్‌కు వచ్చిన వారు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది. తుపాకీతో జింకను వేటాడి కాల్చిచంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీఐ జె. రమేశ్ కథనం ప్రకారం ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు జింకను చంపి దాని మాంసాన్నిఓ గదిలో దాచారని పోలీసులకు సమాచారం అందింది.
దీంతో వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు జింక మాంసం, తల, చర్మం, పొట్ట, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. నానక్‌రాంగూడ వెటర్నరీ డాక్టర్ అరుణ అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, మాంసం శాంపిళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సెంట్రల్ వర్సిటీలో దారుణం: జింక కాల్చివేత, మాంసం ఇదే
జింక చర్మాన్ని పరిశీలించగా రెండు చోట్ల తుపాకీ గుళ్లు లోపలికి చొచ్చుకొని వెళ్లినట్లు తెలుస్తోందని సీఐ తెలిపారు. ఉదయం 6 గంటలకే చంపి ఉంటారని పేర్కొన్నారు. మధ్యాహ్న సమయంలో తలను వేరు చేసి చర్మాన్ని వలిచారని, గుట్టు చప్పుడు కాకుండా సెక్యూరిటీ గదిలో దాచి ఉంచారని తెలిపారు.

సెంట్రల్ వర్సిటీలో దారుణం: జింక కాల్చివేత, మాంసం ఇదే
జింక మాంసం శాంపిళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు సీఐ తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక ఆధారంగానే కేసు దర్యాప్తు జరుగుతుందన్నారు. జింకను ఎంతమంది వేటాడారో దర్యాప్తులో తేలుతుందన్నారు. కాగా కుక్కలు చంపేశాయని ప్రధాన నిందితుడుగా భావిస్తున్న షూటింగ్‌రేంజ్ కోచ్ గోవిందరావు పేర్కొన్నారు.

సెంట్రల్ వర్సిటీలో దారుణం: జింక కాల్చివేత, మాంసం ఇదే
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెళియాపుట్టికి చెందిన పి.గోవిందరావు చందానగర్లో నివాసముంటూ పన్నెండేళ్లుగా సెంట్రల్ యూని వర్సిటీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలో ఎయిర్ రైఫిల్, ఎయిర్ పిస్టల్ కోచ్‌గా పనిచేస్తున్నారు. షూటింగ్ రేంజ్‌లో సాయి సెక్యూరిటీ కంపెనీకి చెందిన సెక్యూరిటీ గార్డులు ఉదయం ఐదుగురు, రాత్రి నలుగురు పనిచేస్తుంటారు.

సెంట్రల్ వర్సిటీలో దారుణం: జింక కాల్చివేత, మాంసం ఇదే
అయితే గోవిందరావు సెక్యూరిటీ గార్డులను ఉదయం 6 గంటలకే విధులకు రావాలని ఆదేశించినట్లు తెలిసిందని, ఈ క్రమంలోనే తుపాకీతో వేటాడి ఉంటాడని పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని తెలిపారు. మద్యం మత్తులో ఉన్న గోవిందరావు, శేరిలింగంపల్లిలో నివాసముండే సెక్యూరిటీ గార్డులు బి.చంద్రయ్య (65), ఎన్.రాజయ్య (54)లతో పాటు జింకను కోసిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications