వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2న్నర వేల ఏళ్ల కిందటే గాజు పరిశ్రమ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్: ఆధునిక పరిజ్ఞానం జాడలేని కాలంలోనే తెలంగాణలో గాజుల తయారీ పరిశ్రమ అద్భుతంగా వర్ధిల్లింది. ఇందుకు నిదర్శనంగా తెలంగాణ జిల్లాల్లో చాలా ఆధారాలు లభ్యమయ్యాయి కూడా. ఇప్పటికే కరీంనగర్ జిల్లా కోటిలింగాల, మెదక్ జిల్లా కొండాపూర్, నల్లగొండ జిల్లా గాజుల బండ వంటివి గాజుల తయారీలో ప్రసిద్ధి చెందినవి కాగా, తాజాగా మహబూబ్‌నగర్ జిల్లాలోని వంగూరు మండలం తిమ్మాయిపల్లిలో రెండున్నరవేళ్లకు పూర్వం నాటిదిగా భావిస్తున్న గాజుల పరిశ్రమ వెలుగు చూసింది.

రెండున్నర వేల ఏళ్ల కిందటి బృహత్ శిలాయుగానికి చెందిన గాజు పరిశ్రమ ఆనవాళ్లు మహమూబ్‌నగర్ జిల్లాలో ఉన్నాయని పురావస్తు రంగంలో ఔత్సాహిక పరిశోధకుడు ద్యావనవల్లి సత్యనారాయణ తెలిపారు. తన అన్వేషణలో జిల్లాలోని వంగూరు మండలం తిమ్మాయిపల్లి సమీపాన మొట్టమొదటి గాజుల పరిశ్రమ ఆనవాళ్లు కనుగొన్నట్లు వెల్లడించారు.

గతంలో వంగూరు మండలంలో ఉన్న పురాతన బట్టీలు, చిమ్నీలను చూస్తే ఇక్కడినుంచే తయారీ జరిగి ఉండొచ్చని ఆయన తెలిపారు. తిమ్మాయిపల్లి పరిసరాల్లో గాజుల బట్టీలు, అద్భుతమైన అలంకరణల్లో ఉన్న కుండల పెంకులు, గాజుల ముక్కలు, బట్టీ స్తూపాలు ఉన్నట్లు పరిశోధనలో తేలినట్లు ఆయన పేర్కొన్నారు.

గాజుల తయారీ బట్టీ

గాజుల తయారీ బట్టీ

ఆధునిక పరిజ్ఞానం జాడలేని కాలంలోనే తెలంగాణలో గాజుల తయారీ పరిశ్రమ అద్భుతంగా వర్ధిల్లింది. ఇందుకు నిదర్శనంగా తెలంగాణ జిల్లాల్లో చాలా ఆధారాలు లభ్యమయ్యాయి కూడా.

ఆనవాలు

ఆనవాలు

ఇప్పటికే కరీంనగర్ జిల్లా కోటిలింగాల, మెదక్ జిల్లా కొండాపూర్, నల్లగొండ జిల్లా గాజుల బండ వంటివి గాజుల తయారీలో ప్రసిద్ధి చెందినవి కాగా, తాజాగా మహబూబ్‌నగర్ జిల్లాలోని వంగూరు మండలం తిమ్మాయిపల్లిలో రెండున్నరవేళ్లకు పూర్వం నాటిదిగా భావిస్తున్న గాజుల పరిశ్రమ వెలుగు చూసింది.

ఆనవాలు

ఆనవాలు

రెండున్నర వేల ఏళ్ల కిందటి బృహత్ శిలాయుగానికి చెందిన గాజు పరిశ్రమ ఆనవాళ్లు మహమూబ్‌నగర్ జిల్లాలో ఉన్నాయని పురావస్తు రంగంలో ఔత్సాహిక పరిశోధకుడు ద్యావనవల్లి సత్యనారాయణ తెలిపారు.

ఆనవాలు

ఆనవాలు

తన అన్వేషణలో జిల్లాలోని వంగూరు మండలం తిమ్మాయిపల్లి సమీపాన మొట్టమొదటి గాజుల పరిశ్రమ ఆనవాళ్లు కనుగొన్నట్లు వెల్లడించారు.

ఆనవాలు

ఆనవాలు

గతంలో వంగూరు మండలంలో ఉన్న పురాతన బట్టీలు, చిమ్నీలను చూస్తే ఇక్కడినుంచే తయారీ జరిగి ఉండొచ్చని ఆయన తెలిపారు.

ఆనవాలు

ఆనవాలు

తిమ్మాయిపల్లి పరిసరాల్లో గాజుల బట్టీలు, అద్భుతమైన అలంకరణల్లో ఉన్న కుండల పెంకులు, గాజుల ముక్కలు, బట్టీ స్తూపాలు ఉన్నట్లు పరిశోధనలో తేలినట్లు ఆయన పేర్కొన్నారు.

ఆనవాలు

ఆనవాలు

ఈ ప్రాంతంలో ఓ పురాతన పరిశ్రమ, చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లపై పురావస్తు శాఖ లోతుగా పరిశీలిస్తే మరిన్ని వివరాలు వెలుగు చూసే అవకాశం ఉందన్నారు.

ఆనవాలు

ఆనవాలు

తిమ్మాయిపల్లి పరిసరాల్లో గాజుల బట్టీలు, అద్భుతమైన అలంకరణల్లో ఉన్న కుండల పెంకులు, గాజుల ముక్కలు, బట్టీ స్తూపాలు ఉన్నట్లు పరిశోధనలో తేలినట్లు ఆయన పేర్కొన్నారు.

English summary
It said that there is bangles industry in mahaboobnagar 2 thousand years ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X