"నయీం వెనక తుపాకీతో యువతి, 24 గంటలు నరకం"

హైదరాబాద్: ఎదురు కాల్పుల్లో హతమైన నయీం గురించి విచిత్రమైన, ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అతడి చుట్టూ 20 ఏళ్ల వయసు గల యువతులున్నారని, వారి చేతుల్లో ఆయుధాలున్నాయని ఓ బాధితుడు చెప్పాడు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అతను ఆ విషయాలు చెప్పాడు. నయీం అతడి డెన్‌లో 24 గంటల పాటు తనకు నరకం చూపించాడని ఆవేదిన వ్యక్తం చేశాడు.

తనను బెదిరించినంత సేపూ నయీం వెనక ఓ యువతి తుపాకీ పట్టుకుని నిలబడి ఉందని, అడిగినంత డబ్బు ఇచ్చుకోలేనంటూ తాను నయీం కాళ్లావేళ్లా ప్రాధేయపడేందుకు ముందుకు జరిగినప్పుడల్లా ఆమె వారిస్తూ వచ్చిందని అతను పోలీసు ఫిర్యాదు చెప్పినట్లు సమాచారం.

 20 year old girls around nayeem with weapons

నయీంను తాకనివ్వకుండా కనుసైగలతోనే బెదిరిస్తూ వచ్చిందని కూడా చెప్పాడు. నయీం వెనక కీలకంగా వ్యవహరించిందంతా యువతులేనని, 24 గంటలూ అతడిని కాపాడేది కూడా వారేనని అంటున్నారు. అమ్మాయిలపై మోజుతో నయీం ప్రతీక్షణం వారితోనే గడిపేవాడని అంటున్నారు. తనకు మూడంచెల రక్షణ వలయాన్ని యువతులతోనే ఏర్పాటు చేసుకున్నాడని అంటున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ముంబైకి చెందిన కొందరు అమ్మాయిలను నయీం రప్పించుకున్నట్లు చెబుతున్నారు. వారికి కొందరు నిపుణులతో ప్రత్యేకంగా తర్ఫీదు ఇప్పించాడని సమాచారం. కొన్ని ప్రత్యేక సెటిల్‌మెంట్లు చేయడానికి పూర్తిగా అమ్మాయిలనే వాడేవాడని కూడా చెబుతున్నారు. కొన్ని హత్యల బాధ్యతలను కూడా వారికి అప్పంగించినట్లు తెలుస్తోంది.

కొనపురి రాములు హత్యలోనూ ఓ మహిళ కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. రాములు హత్య కోసం ఆయుధాల సరఫరా, స్కెచ్‌కు అనుకూలమైన సమయం కల్పించడదం కోసం మహిళలను వాడినట్లు చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే రాములు హత్య తర్వాత ఓ మహిళ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+