తెలంగాణలో కొత్తగా 2176 కరోనా కేసులు... మరో 8 మంది మృతి...

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2176 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 1257 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మరో 8 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,79,246కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1077కి చేరింది. ప్రస్తుతం 30,037 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. వీరిలో 23,929 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

గడిచిన 24 గంటల్లో 2,004 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,48,139కు చేరింది. గడిచిన 24గంటల్లో మొత్తం 55,138 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 26,84,215కు చేరింది. ఒక మిలియన్ జనాభాకు సగటున 72,229 కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులెటిన్‌లో వెల్లడించారు.

 2176 new coronavirus cases and 8 deaths reported from telangana

ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.59శాతం ఉండగా... తెలంగాణలో 0.59శాతం ఉన్నట్లు తెలిపారు. దేశంలో రికవరీ రేటు 81.42శాతం ఉండగా తెలంగాణలో 82.64శాతం ఉన్నట్లు తెలిపారు. కాగా,బుధవారం(సెప్టెంబర్ 23) రాష్ట్రంలో 2296 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మరో 10 మంది కరోనాతో మృతి చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+