తెలంగాణలో కొత్తగా 2392 కరోనా పాజిటివ్ కేసులు..గత 24 గంటల్లో 11 మంది మృతి

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. కొత్త కేసులు రోజూ వేల సంఖ్యలో పుట్టుకొస్తూనే ఉన్నాయి. అదే సమయంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య మెరుగుపడుతోంది. తాజాగా నమోదైన డిశ్చార్జిల సంఖ్య లక్ష మార్క్‌ను అందుకుంది. ఒకవంక కరోనా కేసుల వెల్లువ కొనసాగుతున్న సమయంలో.. దానికి అనుగుణంగా కోలుకున్న వారి సంఖ్య కూడా నమోదు కావడం ఊరట కలిగించే అంశం. కరోనా వల్ల సంభవించిన మరణాల సంఖ్య అదుపులోనే ఉందని అధికారులు చెబుతున్నారు. రోజూ 10కి అటు ఇటుగా మరణాలు నమోదవుతున్నాయని పేర్కొంటున్నారు.

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2392 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.11 మంది మరణించారు. 2346 మంది డిశ్చార్జి అయ్యారు. డిశ్చార్జి అవుతోన్న వారి సంఖ్య లక్షను దాటేసింది. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,45,163కు చేరుకుంది. ఇందులో 1,12,587 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 906కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 31,670గా నమోదైంది.

2392 new Corona positive cases and 11 deaths reported in the last 24 Hours in Tealngana

గ్రేటర్ హైదరాబాద్‌లో 24 గంటల్లో కొత్తగా 304 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కరోనా తీవ్రత రోజురోజుకూ అధికమౌతోంది. కొత్త కేసులు 191గా నమోదయ్యాయి. 24 గంటల్లో కొత్తగా ఆదిలాబాద్-33, భద్రాద్రి కొత్తగూడెం-95, జగిత్యాల-64, జనగామ-38, జయశంకర్ భూపాలపల్లి-18, జోగుళాంబ గద్వాల-22, కామారెడ్డి-76, కరీంనగర్-157, ఖమ్మం-116, కొమరంభీమ్ ఆసిఫాబాద్-20, మహబూబ్ నగర్-45, మహబూబాబాద్-71, మంచిర్యాల-69, మెదక్-36, మేడ్చల్ మల్కాజ్‌గిరి-132, ములుగు-20, నాగర్ కర్నూలు-53, నల్లగొండ-105, నారాయణపేట్-8, నిర్మల్-34, నిజామాబాద్-102, పెద్దపల్లి-68, రాజన్న సిరిసిల్ల-64, రంగారెడ్డి-191, సంగారెడ్డి-37, సిద్ధిపేట్-89, సూర్యాపేట్-101, వికారాబాద్-15, వనపర్తి-40, వరంగల్ రూరల్-21, వరంగల్ అర్బన్-91, యాదాద్రి భువనగిరి-57 కేసులు నమోదు అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+