తెలంగాణలో కరోనా కల్లోలం: కొత్తగా 2707 కరోనా కేసులు, 20వేలు దాటిన యాక్టివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో 84,280 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 2707 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,02,801కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం సాయంత్రం బులిటెన్ విడుదల చేసింది.
గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా బారినపడి ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 4049కి చేరింది. బుధవారం కరోనా నుంచి 582 మంది కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1382 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 20,462 యాక్టివ్ కేసులున్నాయి.

కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కరోనా నిబంధనలు పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. పండుగ కాలం కావడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో కోవిడ్ ని బంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు వెల్లడిస్తున్నారు.
జిల్లాల వారిగా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ 14, భద్రాద్రి కొత్తగూడెం 40, జీహెచ్ఎంసీ 1328, జగిత్యాల 19, జనగాం 17, జయశంకర్ భూపాలపల్లి 06, జోగులాంబ గద్వాల 07, కామారెడ్డి 14, కరీంనగర్ 38, ఖమ్మం 56, కొమురం భీమ్, ఆసిఫాబాద్ 14, మహబూబ్ నగర్ 35, మహబూబాబాద్ 44, మంచిర్యాల 58, మెదక్ 24, మేడ్చల్ మల్కాజ్ గిరి 248, ములుగు 08, నాగర్ కర్నూలు 22, నల్గొండ 29, నారాయణపేట 14, నిర్మల్ 13, నిజామాబాద్ 60, పెద్దపల్లి 52, రాజన్న సిరిసిల్ల 13, రంగారెడ్డి 202, సంగారెడ్డి 78, సిద్ధిపేట 36, సూర్యాపేట 38, వికారాబాద్ 36, వనపర్తి 15, వరంగల్ రూరల్ 17, హన్మకొండ 75, యాదాద్రి భువనగిరి 37 కేసులు నమోదయ్యాయి.
ఐదు కోట్ల మార్క్ దాటిన వ్యాక్సినేషన్
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ 5 కోట్ల మార్క్ దాటిందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మొదటి డోసు 100 శాతం పూర్తి చేసిన తొలి పెద్ద రాష్ట్రంగా రికార్డు నెలకొల్పిన తెలంగాణ.. మరో మైలురాయి చేరుకుందని తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ గురువారంతో 5 కోట్ల డోసులను అధిగమించిందని చెప్పారు. ఇందులో మొదటి డోసు 2.93 కోట్లు కాగా, రెండో డోసు 2.06 కోట్లుగా ఉంది. బూస్టర్ డోసు 1.9లక్షల మంది తీసుకున్నారు. వైద్య సిబ్బంది కేవలం కేవలం 35 రోజుల్లోనే కోటి టీకాలు పంపిణీ చేసినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications