BRS: సోమవారం బీఫామ్‍లు అందుకున్న మరో 28 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు..
అదివారం పలువురు అభ్యర్థులకు సీఎం కేసీఆర్ బీఫామ్ లు అందజేశారు. నిన్న 69 మంది బీఫామ్ లు అందుకోగా.. సోమవారం మరో 28 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు బీఫామ్ తీసుకున్నారు. సోమవారం బీఫామ్ అందుకున్న వారిలో సంజయ్ కల్వకుంట్ల(కోరుట్ల), Dr. M. సంజయ్ కుమార్(జగిత్యాల), కొప్పుల ఈశ్వర్(ధర్మపురి), కోరుకంటి చందర్ (రామగుండం), పుట్టా మధు(మంథని), చింత ప్రభాకర్(సంగారెడ్డి), చామకూర మల్లారెడ్డి(మేడ్చల్), కె పి వివేకానంద్ గౌడ్(కుత్భుల్లాపూర్), మాధవరం కృష్ణారావు(కూకట్ పల్లి), మంచిరెడ్డి కిషన్ రెడ్డి(ఇబ్రహీంపట్నం) ఉన్నారు.
అలాగే సబితా ఇంద్రారెడ్డి(మహేశ్వరం), టి. ప్రకాశ్ గౌడ్ (రాజేంద్ర నగర్), కాలె యాదయ్య, కొప్పుల మహేశ్ రెడ్డి, మెతుకు ఆనంద్, ముఠా గోపాల్(ముషీరాబాద్), కాలేరు వెంకటేశ్(అంబర్ పేట), దానం నాగేందర్(ఖైరతాబాద్), మాగంటి గోపీనాథ్(జూబ్లీహిల్స్), టి. పద్మారావు గౌడ్(సికింద్రాబాద్), లాస్య నందిత(కాంటోన్మెంట్), గొంగిడి సునీత(అలేరు), శానంపూడి సైదిరెడ్డి(హుజుర్ నగర్), డి.ఎస్.రెడ్యానాయక్(డోర్నకల్), బానోత్ శంకర్ నాయక్(మహబూబాబాద్), చల్లా ధర్మారెడ్డి పరకాల, ఆరూరి రమేశ్(వర్ధన్నపేట), గండ్ర వెంకట రమణారెడ్డి(భూపాలపల్లి) కూడా సోమవారమే బీఫామ్ లు తీసుకున్నారు.

ఇప్పటి వరకు మొత్తం 97 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్ లు అందాయి. ఆదివారం బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెసిందే. మేనిఫెస్టోలో కేసీఆర్ బీమా - ప్రతి ఇంటికి ధీమా, ఆసరా పింఛను రూ.5,016కి పెంపు. ప్రస్తుతం రూ.2,016 ఇస్తుండగా.. తొలి సంవత్సరంలో రూ.3,016కు పెంచుతామని కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత ఏటా రూ.500ల చొప్పున ఐదేళ్లలో రూ.5,016 పెంచుతామని వివరించారు.
దివ్యాంగులకు పింఛను రూ.6వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. రైతు బంధు సాయం మొత్తాన్ని రూ.16వేలకు దశల వారీగా పెంచుతామని మేనిఫెస్టోలో ప్రకటించారు. తొలి ఏడాది సాయాన్ని రూ.12వేల వరకు పెంచుతామని పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీపై ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. గత రెండు పరియాయలు రైతు రుణ మాఫీ హామీ ఇచ్చిన బీఆర్ఎస్ ఈసారి మాత్రం రైతు రుణమాఫీపై ఎలాంటి ప్రకటన చేయలేదు.












Click it and Unblock the Notifications