టెక్కీ ఘాతుకం: పని మనిషితో శృంగారం.. పోర్న్ వెబ్‌సైట్లో వీడియో.. వెలుగులోకి మరిన్ని నిజాలు!

హైదరాబాద్: ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన ఇంట్లో పని చేసే మహిళను వలలో వేసుకున్నాడు. అంతటితో ఊరుకోలేదు.. ఆమెతో ఏకాంతంగా గడిపిన వీడియోలను ఓ పోర్న్ వెబ్‌సైట్లోకి అప్‌లోడ్ చేశాడు.

ఈ కేసు విచారణ జరిపిన పోలీసులకు మరిన్ని షాకింగ్ నిజాలు తెలిశాయి. అతడు తరచూ పోర్న్ వెబ్‌సైట్లలో అశ్లీల వీడియోలు వీక్షిస్తాడట, అంతేకాదు, ఓ వెబ్‌సైట్‌కు అతడు ప్రీమియం మెంబర్ అట. గతంలో ఎన్నోసార్లు అతడు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డాడట.

పనిమనిషితో టెక్కీ శృంగారం...

పనిమనిషితో టెక్కీ శృంగారం...

హైదరాబాద్‌కు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వెలగబెడుతున్నాడు. రోజూ అతడి ఇంట్లో పనిచేసేందుకు ఓ మహిళను నియమించుకున్నాడు. ఆమెతో పరిచయం పెంచుకొని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగని నాగేశ్వరరావు... ఆమెతో ఏకాంతంగా గడుపుతున్న దృశ్యాలను తన కెమెరాతో రికార్డు చేశాడు.

శృంగార దృశ్యాలు పోర్న్ వెబ్‌సైట్‌లోకి...

శృంగార దృశ్యాలు పోర్న్ వెబ్‌సైట్‌లోకి...

అలా రికార్డు చేసిన వీడియోలను గుట్టుచప్పుడు కాకుండా పోర్న్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాడు. అంతేకాదు నాగేశ్వరరావు ఆ వెబ్‌సైట్‌కు ప్రీమియమ్ మెంబర్ కూడానట. ఇలా వీడియోలు అప్‌లోడ్ చేసినందుకు వెబ్‌సైట్ వాళ్లు కూడా అతడికి డబ్బు ఇచ్చేవాళ్లు. దీంతో అతడు ఆ వెబ్‌సైట్లో తరచూ ఇలాంటి వీడియోలు అప్‌లోడ్ చేసేవాడు.

కొడుకు వచ్చి చెప్పేవరకు...

కొడుకు వచ్చి చెప్పేవరకు...

ఒకరోజు ఈ వీడియోను బాధితురాలి కుమారుడి స్నేహితుడు చూసి ఆ విషయం అతడికి తెలియజేశాడు. వెంటనే ఆ కుర్రాడు కాస్తా ఆ విషయాన్ని వాళ్ల అమ్మకు చెప్పాడు. దీంతో బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

ఆ వీడియోను తొలగించే ప్రయత్నాలు...

ఆ వీడియోను తొలగించే ప్రయత్నాలు...

విచారణలో నిందితుడు నాగేశ్వరరావు తాను చేసిన పనులన్నీ ఒప్పుకోవడంతో పోలీసులు అతడ్ని రిమాండుకు తరలించారు. అతడు అప్‌లోడ్ చేసిన ఆ పనిమనిషి వీడియోను సదరు వెబ్‌సైట్ నుంచి తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+