రేవంత్‌పై మరో మూడు కేసులు, కేసీఆర్ గురించి మాట్లాడితే ఖబడ్దార్
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో బెయిల్‌పై విడుదలైన తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీద సైబరాబాద్ పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో రెండు, మల్కాజగిరి పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదుయ్యాయి.
చర్లపల్లి జైలు నుంచి బుధవారం విడుదలైన సమయంలో భారీ ర్యాలీ నిర్వహించిన రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాలు, మారణాయుధాలతో బెదిరింపులు, అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారన్న ఆరోపణలతో కేసులు నమోదు చేశారు.

రేవంత్ రెడ్డిపై ఐపీసీ 341, 188, 506, 509 సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేశారు. బెయిల్ మీద జైలు నుంచి విడుదలైన సందర్భంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్‌పై, మంత్రులపై నేరుగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
సీఎం కేసీఆర్ గురించి అడ్డగోలుగా: మంత్రి మహేందర్
ఓటుకు నోటు కేసులో ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన నిందితులు సీఎం కేసీఆర్ గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మంత్రి మహేందర్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు ట్రైనింగ్ ఇచ్చి రేవంత్ రెడ్డితో తిట్టిపిస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్‌పై మరోసారి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని, ఆయన గురించి మాట్లాడొద్దని అన్నారు. కేసీఆర్ గురించి మాట్లాడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కథ అయిపోయిందని, అసలు కథ ముందుందని అన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబుని ఓటుకు నోటు కేసు నుంచి ఎవరూ తప్పించలేరని అన్నారు.












Click it and Unblock the Notifications