డూప్లెక్స్ ఇంటిలో, రెండేళ్లుగా: జూబ్లీహిల్స్‌లో హైటెక్స్ సెక్స్ రాకెట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో హైటెక్ సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టయింది. ప్రశాసన్ నగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న కీలక సూత్రధారి ఫయీజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఫయీజ్ జూబ్లీహిల్స్‌లోని ఓ డూప్లెక్స్ ఇంటిలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడులు నిర్వహించారు.

కోల్‌కతా, గోవా, ముంబై ప్రాంతాల నుంచి యువతులు
ఈ దాడులలో కోల్‌కతా, గోవా, ముంబై ప్రాంతాల నుంచి యువతులను వారం, పది రోజుల పాటు హైదరాబాదుకు తీసుకు వచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పదేళ్ల నుంచి ఫయీజ్ వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

హైదరాబాదులో రెండేళ్లుగా
అయితే హైదరాబాదులో మాత్రం గత రెండేళ్లుగా నిర్వహిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అతడి నుంచి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు చెందిన ఇద్దరు యువతులు, మహబూబ్ నగర్‌కు చెందిన ఓ యువతిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు.

ఫయీజ్‌తో పాటు మరో ఇద్దరు
హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న సూత్రధారి ఫయీజ్‌తో పాటు అతనికి సహకరించిన జోసఫ్, సురేష్ అనే మరో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితల నుంచి నగదు, మొబైల్ ఫోన్లు, కండోమ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

ఆరుగురు దళారులను ఏర్పాటు చేసుకొని
ఫయీజ్‌తో పాటు ఆరుగురు దళారులను ఏర్పాటు చేసుకొని ఈ బిజినెస్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను కస్టడీకి తీసుకొని మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, వారు ఈ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న డూప్లెక్స్ ఇంటి యజమాని ముంబైలో ఉంటాడని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications