దుబాయ్‌లో ఘోర ప్రమాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి, చిన్నారికి తీవ్రగాయాలు

దుబాయ్/గోల్కొండ: దుబాయ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ కుటుంబం మృత్యువాత పడింది. మృతుల్లో 8 నెలల చిన్నారి కూడా ఉంది. వీరి మరణంతో స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వరంగల్‌కు చెందిన గౌస్ ఉల్లా ఖాన్(30) హైదరాబాద్ నగరంలోని టోలీచౌకీలో ఉంటూ యూఏఈలో ఉద్యోగం రావడంతో కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్లాడు. శుక్రవారం ఉల్లాఖాన్ తోపాటు అతని భార్య అయేషా(30), కుమార్తె హానియా సిద్ధిఖి(3) కుమారుు హమ్జ(ఒక ఏడాది)తో కలిసి దుబాయ్ హైవే మీదుగా మస్కట్‌కు కారులో బయల్దేరాడు.

3 of family from Hyderabad die in road accident in Muscat

ఎదురుగా వస్తున్న వాహనం అదుపుతప్పి వీరి కారును ఢీకొట్టడంతో పూర్తిగా ధ్వంసమైపోయింది. కాగా, కారులో ఉన్న గౌస్ ఉల్లా, అయేషా, హమ్జలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

తీవ్రంగా గాయపడిన కుమార్ హానియా దుబాయ్‌లోని కౌలా ఆస్పత్రిలో చేర్పించారు. గౌస్ ఉల్లా మరణవార్త తెలియడంతో ఆయన కుటుంబసభ్యులు శనివారం మస్కట్ బయల్దేరి వెళ్లారు. ఆదివారం గౌస్ కుటుంబసభ్యుల మృతదేహాలను నగరానికి తీసుకువచ్చే అవకాశం ఉందని వారి బంధువులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+