ఐఎఎస్ కోచింగ్ సెంటర్‌ మృతుల్లో తెలంగాణ విద్యార్థి

Rau's IAS coaching centre: దేశ రాజధానిలో దిగ్భ్రాంతకర ఘటన చోటు చేసుకుంది. ఐఎఎస్ కావాలని కలలు గన్న ముగ్గురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. స్టడీ సర్కిల్ భవనం బేస్‌మెంట్‌లో నీటిలో చిక్కుకుని జల సమాధి అయ్యారు. వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపారు. మృతుల్లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.

ఈ ఉదంతంపై ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. విద్యార్థుల మృతిపై ఢిల్లీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఈ మేరకు మంత్రి ఆతిషి ఓ ప్రకటన విడుదల చేశారు. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

3 students lost their lives in Delhi s IAS coaching centre were residents of Kerala Telangana and UP

ఢిల్లీలోని రావుస్ ఐఎఎస్ స్టడీ సర్కిల్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ పశ్చిమ ప్రాంతంలోని ఓల్డ్ రాజేంద్రనగర్ బాడా బజార్‌లో ఉంటుందీ కోచింగ్ సెంటర్. ఐఎఎస్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్న వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు ఇక్కడ చదువుకుంటుంటారు.

నాలుగు అంతస్తుల భవనం ఇది. ఈ భవనం బేస్‌మెంట్‌లో లైబ్రరీ సహా కొందరు విద్యార్థులకు వసతి సౌకర్యం ఉంది. రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు ఈ స్టడీ సర్కిల్‌ బేస్‌మెంట్‌లో వరదనీరు పోటెత్తింది. ఆ సమయంలో పలువురు విద్యార్థులు లైబ్రరీలో ఉన్నారు.

ఒక్కసారిగా నీరు బేస్‌మెంట్‌లోనికి ప్రవహించడంతో బయటికి వెళ్లే వీలు లేకుండాపోయింది. కొందరు విద్యార్థులు ప్రాణాలతో బయటపడగలిగారు. ముగ్గురు అక్కడే చిక్కుకుపోయారు. జలసమాధి అయ్యారు. వారిని తానియా సోని, శ్రేయా యాదవ్, నెవిన్ దాల్విన్‌గా గుర్తించారు.

ఈ ముగ్గురూ కేరళ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన విద్యార్థులని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. వారి మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం తరలించినట్లు చెప్పారు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలు ఉంచామని, ఈ ప్రక్రియ ముగిసిన తరువాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అన్నారు.

ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ (సెంట్రల్ జోన్) ఎం హర్షవర్ధన్, అదనపు డీసీపీ సచిన్ శర్మ తెలిపారు. యాజమాన్యంపై కేసు నమోదైనట్లు చెప్పారు. ఫోరెన్సిక్ ఆధారాలు సేకరిస్తోన్నామని, విద్యార్థులు, వారి కుటుంబాలకు న్యాయం చేస్తామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+