హైదరాబాద్‌లో కుప్పకూలిన 300 ఏళ్ల నాటి ఇళ్లు, జనం పరుగులు
హైదరాబాదులో కురిసిన భారీ వర్షాలకు పలు చోట్ల ఇల్లు కూలాయి. రోడ్లు జలమయం అయ్యాయి. లాల్ దర్వాజలోని నాగులచింతలో ఓ పురాతన ఇల్లు కూలింది.
హైదరాబాద్: హైదరాబాదులో కురిసిన భారీ వర్షాలకు పలు చోట్ల ఇల్లు కూలాయి. రోడ్లు జలమయం అయ్యాయి. లాల్ దర్వాజలోని నాగులచింతలో ఓ పురాతన ఇల్లు కూలింది.
అది 300 ఏళ్ల నాటి ఇల్లు. ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలడంతో చుట్టుపక్కల ఉన్న జనాలు భయంతో పరుగులు తీశారు. నేరేడ్‌మెట్, నాగులచింత, లాల్ దర్వాజ, కాప్రా, బహదూర్ పురా తదితర ప్రాంతాల్లో అధికారులు శిథిల భవనాలను తొలగిస్తున్నారు.

కాగా, భారీ వర్షానికి మేడ్చల్, కూకట్‌పల్లిలతో పాటు నగరంలోని చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కూకట్ పల్లిలో అపార్టుమెంటుల్లోకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంచి నీళ్లు లేక అపార్టుమెంటు వాసులు ఇబ్బందులు పడ్డారు.












Click it and Unblock the Notifications