ఇక తెలంగాణలో 33 జిల్లాలు..! రేపటి నుండి మరో రెండు జిల్లాలు అందుబాటులోకి..!!
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుస్తోంది. పరిపాలనకు చిన్న రాష్ట్రాలు, జిల్లాలు అనుకూలంగా ఉంటాయని చెప్పిన ఆయన సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తోంది. అందులో భాగంగా తెలంగాణలో మరో రెండు కొత్త జిల్లాల పరిపాలన ప్రారంభం కానుంది. ఈ నెల 17 లేదా 19వ తేదీ నుంచి కొత్తగా రెండు జిల్లాలు ఉనికిలోకి రానున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటుకు కేసీఆర్ పచ్చజెండా ఊపారు.
దీనికి అనుగుణంగా గతేడాది డిసెంబరు 31న రెండు జిల్లాల ఏర్పాటుకు ముసాయిదా నోటికేషన్ జారీ చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలను ప్రభుత్వం స్వీకరించింది. ఆ తర్వాత వచ్చిన అభ్యంతరాలు, సలహాలు అనుసరించి రెండు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ రెండు జిల్లాల ఏర్పాటుకు తుది నోటిఫకేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 17వ తేదీ నుంచే ఈ రెండు కొత్త జిల్లాలు మనుగడలోకి వస్తాయని అధికారవర్గాలు చెప్పాయి.

అయితే, 19న మంచి రోజు కావడం మంత్రివర్గ విస్తరణ అదే జరగనుండటంతో, జిల్లాల ఏర్పాటు నిర్ణయాన్ని వాయిదా వేసి ఆ తేదీ నుంచే కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభించాలని కూడా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సూచించారు. తుది నోటిఫికేషన్ శనివారమే వస్తే, ఆదివారం నుంచే జిల్లాలలో పాలన మొదలవుతుంది. లేదా 19నుంచి ప్రారంభం అవుతుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో పది జిల్లాలు ఉండేవి.
తెలంగాణ ఏర్పడిన తర్వాత చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికల హామీ మేరకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2016 అక్టోబరు నుంచి 31 జిల్లాలు ఏర్పాటు చేసి పరిపాలన ప్రారంబించారు. అప్పుడే నారాయణపేట, ములుగు జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ వచ్చినా పట్టించుకోలేదు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రెండో సారి అధికారంలోకి వస్తే ఈ రెండు జిల్లాలు ఏర్పాటు చేస్తామని చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారు. ఆ ప్రకారం అధికారంలోకి వచ్చాక రెండు జల్లాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.
-
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications