తెలంగాణలో తగ్గిన కేసులు.. జ్వరాలు మాత్రం ఫుల్
వానలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. దోమల స్వైర విహారంతో.. ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. ఇటు కరోనా కేసులు కూడా వస్తున్నాయి. మరీ ఎక్కువ కాకుండా.. కాసిన్ని కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 24,938 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 396 మందికి పాజిటివ్ వచ్చింది. ఇదీ గతంతో పోలిస్తే చాలా తక్కువ కేసులే.
ఒక్క హైదరాబాద్ మహానగరంలోనే 193 కొత్త కేసులు వచ్చాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27, రంగారెడ్డి జిల్లాలో 23 కేసులు వచ్చాయి. 705 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,25,756 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,15,735 మంది ఆరోగ్యవంతులు అయ్యారు. ఇంకా 5,910 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

కరోనా వైరస్, మంకీ వైరస్.. కాగా ఇప్పుడు కొత్త వైరస్ కలవర పెడుతుంది. మార్బర్గ్ అనే వైరస్ ఆఫ్రికా ఘనా దేశంలో వెలుగుచూసింది. ఆ వైరస్ సోకి ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్నీ దేశాలను అలర్ట్ చేసింది. ఇప్పుడు అంతా సజావుగా ఉంది అనుకునే లోపు కొత్త వైరస్.. వేరియంట్లు వస్తున్నాయి. జనాలను ఎప్పుడూ ఏదో ఒక భయం పెడుతూనే ఉన్నాయి. ఇప్పుడు కరోనా కేసులు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సీరియస్ నెస్ ఎక్కువగా లేకున్నా.. టెన్షన్ మాత్రం తప్పడం లేదు. ఈ సారి వర్షకాలంలో.. సీజనల్ వ్యాధులతోపాటు కేసులు కూడా టెన్షన్ పెట్టిస్తున్నాయి.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications