తెలంగాణలో కొత్తగా 4వేలలోపే కొత్త కరోనా కేసులు: జిల్లాలవారీగా కొత్త కేసులివే, జీహెచ్ఎంసీలో 631

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తుండటంతో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు 5వేల లోపే నమోదవుతున్నాయి. అయితే, కరోనా టెస్టుల సంఖ్య కూడా తగ్గడం గమనార్హం.

తెలంగాణలో కొత్తగా 3961 కరోనా కేసులు, 30 మరణాలు

తెలంగాణలో కొత్తగా 3961 కరోనా కేసులు, 30 మరణాలు


గత 24 గంటల వ్యవధిలో 62,591 నమూనాలను పరీక్షించగా.. 3961 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,32,784కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 30 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 2985కు చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం 631 కరోనా కేసులు నమోదయ్యాయి.

కొత్త కేసుల కంటే కోలుకున్నవారే ఎక్కువ..

కొత్త కేసుల కంటే కోలుకున్నవారే ఎక్కువ..

గత 24 గంటల్లో 5559 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 4,80,458కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 49,341 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 90.17 శాతం ఉంది. మరణాల రేటు 0.56 శాతంగా ఉంది.

జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులు

జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులు

ఇక తెలంగాణ జిల్లాలవారీగా కరోనా కేసులు గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 25, భద్రాద్రికొత్తగూడెంలో 139, జీహెచ్ఎంసీలో 631, జగిత్యాలలో 101, జనగాంలో 39, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 60, జోగులాంబగద్వాలలో 75, కామారెడ్డిలో 33, కరీంనగర్‌లో 160, ఖమ్మంలో 229, కొమురంభీంఅసిఫాబాద్‌లో 30, మహబూబ్ నగర్ 135, మహబూబాబాద్ లో 57, మంచిర్యాల్ 122, మెదక్ 51, మేడ్చల్ మల్కాజిగిరి 258, ములుగులో 62 కరోనా కేసులు నమోదయ్యాయి.

Recommended Video

    Cyclone Tauktae : తుఫాన్ ఉగ్రరూపం Gujarat వద్ద తీరాన్ని, విషాదకర ఘటనలు...! || Oneindia Telugu
    నిర్మల్ జిల్లాలో తక్కువ కరోనా కేసులు

    నిర్మల్ జిల్లాలో తక్కువ కరోనా కేసులు


    నాగర్ కర్నూల్‌ జిల్లాలో 149, నల్గొండలో 138, నారాయణపేట్ 32, నిర్మల్‌లో 26, నిజామాబాద్‌లో 88, పెద్దపల్లిలో 130, రాజన్నసిరిసిల్లలో 73, రంగారెడ్డిలో 257, సంగారెడ్డిలో 73, సిద్దిపేటలో 118, సూర్యపేటలో 80, వికారాబాద్‌లో 137, వనపర్తిలో 108, వరంగల్ రూరల్‌లో 99, వరంగల్ అర్బన్ లో 141, యాదాద్రిభువనగిరి జిల్లాలో 105 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది ఇలావుండగా, రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సోమవారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. లాక్‌డౌన్ అమలు తీరు, ఎదురవుతున్న సమస్యలపై, కరోనా రోగుల చికిత్స, బ్లాక్ ఫంగస్, ఔషధాలు, టీకాలపై చర్చించారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్, బెడ్ల కేటాయింపు తదితర అంశాలపై చర్చించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+