హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముఖానికి చుట్టుకుంటే ఊపిరాగింది: చిన్నారి ప్రాణం తీసిన పాలిథిన్ కవర్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పాలిథిన్ కవర్ ముఖానికి చుట్టుకుని ఊపిరి ఆడన నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాం పేట్‌లో చోటు చేసుకుంది. పోలీసులు, చిన్నారి తల్లిదండ్రులు వెల్లడించిన వివరాల ప్రకారం శ్రీయాన్‌ అనే బాలుడు బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఆడుకుంటూ పాలిథిన్ కవర్‌ను ముఖానికి చుట్టుకున్నాడు.

కొద్దిసేపటికి బెడ్‌రూంలోనికి వెళ్లి మంచంపై పడిపోయాడు. అయితే గదిలో నిద్రపోతున్నాడనుకుని ఇంట్లో వారు బాలుడిని గమనించలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికి గదిలోకి వెళ్లిన తల్లి బాలుడి ముఖానికి పాలిథిన్ కవర్ చుట్టుకుని ఉండటాన్ని చూసి గమనించింది.

image

దీంతో కంగారుపడిన ఆ తల్లి శ్రీయాన్ ముఖానికి ఉన్న పాలిథిన్ కవర్‌ను తీసి చూడగా అప్పటికే బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే బాలుడిని కుటంబ సభ్యులు హుటాహుటిన నిజాంపేటలోని హోలిస్టిక్ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

దొంగలు బీభత్సం

హైదరాబాద్‌ నగరంలో దొంగలు బీభత్సం సృష్టిస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. మొన్న సైబరాబాద్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఇంట్లో దొంగలు పడగా, తాజాగా అసెంబ్లీలో పనిచేస్తున్న ఉద్యోగి వెంకటేశ్వరావు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు ఏడో ఫేజ్‌ ఎల్‌ఐజీ 522లో ఇంటి తాళం పగుల కొట్టి చోరీకి పాల్పడ్డారు.

ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలసి వెంకటేశ్వరరావు బయటికి వెళ్లి వచ్చే సరికే దొంగలు చోరీకి పాల్పడటం విశేషం. వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి, బీరువాలో ఉన్న రూ.3క్షల నగదు దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A 4-year-old boy died due to suffocation after he wrapped a polythene cover tightly around his head and face fully at Nizampet under Kukatpally police limits on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X