రిసార్ట్‌లో యువతులతో అసభ్య నృత్యాలు, అరెస్ట్
మహబూబ్ నగర్: తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్‌లోని ఓ రిసార్టులో రేవ్ పార్టీ పేరిట యువతులతో అసభ్య నృత్యాలు చేయించారు. దీంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. షాద్ నగర్ పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న అగ్రిగోల్డ్ రిసార్టులో శనివారం రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
ఔరంగాబాదుకు చెందిన ఓ సంస్థ కార్యాలయం హైదరాబాదులోని ఆటో నగర్లో ఉంది. కంపెనీ ఉద్యోగులకు షాద్ నగర్ పరిధిలోని అగ్రిగోల్డ్ రిసార్టులో శనివారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు 40 మంది హాజరయ్యారు.

వారిని అలరించేందుకు ఎనిమిది మందియువతులను తీసుకు వచ్చి అశ్లీల నృత్యాలు చేయించారు. సమాచారం అందుకున్న షాద్ నగర్ పోలీసులు రంగంలోకి దిగారు. రిసార్టుకు వెళ్లి 40 మంది వ్యక్తులను, అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications